Chanakya Sutra:ఈ 5 గుణాలు ఉంటే విజయం సాధించడం ఖాయం-చాణక్య నీతి-success secrets for men according chanakya guru ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Chanakya Sutra:ఈ 5 గుణాలు ఉంటే విజయం సాధించడం ఖాయం-చాణక్య నీతి

Chanakya Sutra:ఈ 5 గుణాలు ఉంటే విజయం సాధించడం ఖాయం-చాణక్య నీతి

Ramya Sri Marka HT Telugu
Nov 11, 2024 07:33 PM IST

చాణక్య నీతి: కఠోర తపస్సుతోనే మనిషి సాధించగల కొన్ని విషయాలను ఆచార్య చాణక్యుడు తన నీతిలో వివరించాడు.ఈ చాణక్య నీతిని మీరు తెలుసుకోవాల్సిందే.

చాణక్యుడు నీతి సూత్రాలు
చాణక్యుడు నీతి సూత్రాలు (Pixabay)

అఖండ భారతావని కోసం పరితపించిన దేశభక్తుడు ఆచార్య చాణక్యుడు. అత్యంత మేథో సంపన్నుడైన ఈయన గొప్ప తత్వవేత్త, రాజకీయవేత్త, పండితుడు కూడా. దుర్మార్గుల చెర నుంచి దేశాన్ని కాపాడతానని, తాను చేసిన శపథానికి కట్టుబడి వ్యూహ రచనతో ఏళ్ల తరబడి పోరాడిన యోధుడు. లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసిన ఆయన తెలివితేటలు ఎన్ని తరాలకైనా ఆదర్శంగా నిలిచి ఉంటాయి. చాణక్యుడే స్వయంగా తన నీతి గ్రంథంలో ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను వివరించారు. ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి. ఎటువంటి వ్యక్తులతో ఎలా నడుచుకోవాలనే నీతి సూత్రాలను బోధించారు.

మానవులు కొన్ని విషయాల్లో విజయం సాధించాలంటే కఠినమైన తపస్సు చేయాల్సి ఉంటుందని చాణక్యుడు ఒక శ్లోకం ద్వారా వివరంగా తెలిపాడు. విజయానికి తగ్గ కష్టం లేకుండా మనిషి జీవితంలో ఎటువంటి విజయాన్ని సాధించలేడని వివరించాడు.

ఆ శ్లోకం ఏంటంటే..

“భోజ్యం భోజనశక్తి రతిశక్తి వరంగన, విభావో దానశక్తి నల్పాస్య తపస్ఫష్ ఫలం”

ఈ శ్లోకానికి అర్థం ఏమంటే, ఆహారం కోసం మంచి పదార్థాలను సమీకరించుకోవడం, వాటిని తిన్న తర్వాత వాటిని జీర్ణం చేసుకునే శక్తి కలిగి ఉండటం, అందమైన స్త్రీని పొందడం, ఆమెను సంతోషంగా చూసుకునే శక్తి కలిగి ఉండటం, డబ్బు సంపాదించి దానం చేయగలగడం ఇవన్నీ ఒక వ్యక్తి కఠినమైన తపస్సు తర్వాతే సాధిస్తాడు.

చాణక్యుడు చెప్పిన దానిని బట్టి.. ప్రతి ఒక్కరూ ఆహారంలో మంచి పదార్థాలను కోరుకుంటారు. కానీ వాటిని పొందడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే తిన్న ఆహార పదార్థాలను చక్కగా జీర్ణించుకునే శక్తి కూడా కలిగి ఉండాలి. ప్రతి పురుషుడు తన భార్య అందంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ పురుషుడు కూడా లైంగిక శక్తిని కలిగి ఉండాలి. భాగస్వామితో సామరస్యంగా జీవించడానికి ఇది కూడా ముఖ్యమే. అలాగే ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది. కానీ దానిని దక్కించుకున్న తర్వాత ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియదు. ఆ విషయంలో చాలా మంది విఫలమవుతారు. డబ్బును సరైన మార్గంలో ఉపయోగించే పరిజ్ఞానం ఉండాలి. డబ్బు వచ్చినప్పుడు కొంత భాగాన్ని దానం చేయడానికి సిద్ధంగా ఉండాలని చాణక్యుడు తన విధానాల్లో పేర్కొన్నాడు.

ఆచార్య చాణక్యుడు తన మెళకువలు, నైపుణ్యాలతో సామ్రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించాడు. ఆయన సిద్ధాంతాలు, విధానాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో అందరికీ తెలుసు. రాజకీయాలతో పాటు ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను ఆయన వివరించారు. చాణక్యుడి నీతిలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. చాణక్యుడు రచించిన నీతి పుస్తకం నేటికీ ఎంతో ప్రాచుర్యం పొందింది. దాని ద్వారా చాలా మంది జీవితంలోని ముఖ్యమైన విషయాలను తెలుసుకోగలిగారు.

నిరాకరణ: ఈ కథనంలోని సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వాటిని స్వీకరించే ముందు సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

Whats_app_banner