Sri rama navami 2024: శ్రీరామనవమి శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత, పఠించాల్సిన మంత్రాలు-sri rama navami 2024 date time significance puja vidhanam and chanting mantras ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sri Rama Navami 2024: శ్రీరామనవమి శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత, పఠించాల్సిన మంత్రాలు

Sri rama navami 2024: శ్రీరామనవమి శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత, పఠించాల్సిన మంత్రాలు

Gunti Soundarya HT Telugu
Apr 17, 2024 07:59 AM IST

Sri rama navami 2024: ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి జరుపుకుంటున్నారు. ఈరోజు పూజ చేసేందుకు శుభ ముహూర్తం, పూజా విధానం, పఠించాల్సిన మంత్రాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

శ్రీరామనవమి పూజా విధానం
శ్రీరామనవమి పూజా విధానం (pinterest)

Sri rama navami 2024: ఈ ఏడాది శ్రీరామనవమి అరుదైన యోగాల మధ్య జరుపుకుంటున్నాం. గజకేసరి యోగంతో పాటు ఆశ్లేష నక్షత్రంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు మొత్తం కూడా రవి యోగం ఉంటుంది. అలాగే సర్వార్థ సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది. చైత్ర నవరాత్రులు శ్రీరామనవమితో ముగుస్తాయి.

శ్రీరామనవమి రోజున మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడిని పూజించేందుకు  చాలా ప్రాముఖ్యత ఇస్తారు. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు. ఈరోజు శ్రీరాముడు జన్మించాడని నమ్ముతారు. చైత్ర నవరాత్రులు ముగియడంతో సిద్ధి ధాత్రి దేవిని, శ్రీ సీతారాములను, లక్ష్మణుడు, హనుమంతులను పూజిస్తారు.

శుభ ముహూర్తం

హిందూ క్యాలెండర్ ప్రకారం నవమి తిథి ఏప్రిల్ 16 మధ్యాహ్నం 1.23 గంటలకు ప్రారంభమైంది. ఏప్రిల్ 17 మధ్యాహ్నం 3.18 గంటలకు ముగుస్తుంది. అందువల్ల ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 17న శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి పూజ చేసేందుకు ముహూర్తం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:43 వరకు ఉంటుంది. వ్యవధి 2 గంటల 30 నిమిషాలు.

పూజా విధానం

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లో ఉన్న పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ సామాగ్రిని సేకరించి పెట్టుకోవాలి. ఒక చిన్న పీట వేసి దాని మీద ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం పరచాలి. దానిపై రామదర్భార్ లేదా శ్రీసీతారాములు చిత్రపటాన్ని ప్రతిష్టించాలి. శ్రీరాముడికి పంచామృతం, కుంకుమపువ్వు, పాలు, గంగాజలతో అభిషేకం చేయాలి.

రామ దర్బార్ ప్రతిష్టించుకునేటప్పుడు వాస్తు చూసుకోవాలి. ఈ ఫోటోని వాస్తు ప్రకారం ఇలా చేయడం ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. వాస్తు లోపాలు తొలగిపోతాయి. రామ దర్భార్ ని పూజించడం వల్ల ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆచారాల ప్రకారం పూజ చేయాలి. పసుపు రంగు వస్త్రాలు సమర్పించడం వల్ల శ్రీరాముడి అనుగ్రహం పొందుతారు.

సకల దేవతలకు పండ్లు, పూలు, గంధం, సుగంధ ద్రవ్యాలు, ధూపదీపాలు సమర్పించాలి. శ్రీరాముడికి ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. రామచరిత మానస్, శ్రీ రామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల శ్రీరాముడి అనుగ్రహం పొందుతారు. ప్రసాదంగా సమర్పించే నైవేద్యాలలో తులసి ఆకులు తప్పనిసరిగా వేయాలి. పూజ పూర్తయిన తర్వాత అందరికీ వాటిని పంచి పెట్టాలి.

శ్రీరామనవమి రోజు పఠించాల్సిన మంత్రాలు

శ్రీరామనవమి రోజు శ్రీరాముడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరతాయని, జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. శ్రీరాముడిని పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక మంత్రాలు జపించడం వల్ల సకల దుఃఖాలు, సంక్షోభాలు తొలగిపోయి సాధకుడికి సుఖసంతోషాలు చేకూరుతాయి.

విజయం కోసం ‘ఓం రామ్ ఓం రామ్ ఓం రామ్ ఓం రామ్ హి రామ్ శ్రీ రామ్’ అని పఠించాలి.

ఇంట్లో బాధలు తొలగిపోయేందుకు ‘ఓం రామచంద్రాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి.

ధన లాభం కోసం ‘శ్రీ రామాయ నమః’ అనే మంత్రాన్ని పఠించాలి.

సంతోషం, శ్రేయస్సు కోసం ‘హరే రామాయ నమః’ జపిస్తే మంచిది.

తెలివితేటలు, విచక్షణ, శ్రీరాముడి అనుగ్రహం పొందడం కోసం ‘రామాయ నమః’ అనే మంత్రాన్ని జపించడం మంచిది.

శ్రీరామనవమి రోజున రామ రక్షా మూలాన్ని పఠించాలి. జీవితంలోని అన్ని బాధలు సంక్షోభాలు తొలగిపోతాయి. శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల సకల కోరికలు నెరవేరతాయని నమ్ముతారు.

 

 

Whats_app_banner