శ్రీ పంచమి, వసంత పంచమి విశిష్టత ఏమిటి-చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
విద్యాధి దేవత అయిన సరస్వతీ దేవి జన్మదినమే శ్రీ పంచమి. అహింసకు అధిదేవత సరస్వతి. సరః అనగా కాంతి. కాంతి కలిగినది కనుక సరస్వతిగా పేర్కొంటారు.అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతులను విరజిమ్మేది సరస్వతి. శ్వేత పద్మాసనాసీనురాలై వీణ, పుస్తకము, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది.
మాఘ శుక్ల పంచమిని శ్రీ పంచమి, వసంత పంచమి మదన పంచమి అని కూడా వ్యవహరిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.

జ్ఞానప్రాప్తి కోసం సరస్వతీ దేవిని ఆరాధించాలని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. ఆరాధన విధి విధానాలను శ్రీమన్నారాయణుడు నారదునికి బోధించినట్లు దేవీ భాగవతం చెప్తోంది. శ్రీ పంచమి నాడే రతీమన్మథులు ఋతురాజు వసంత ఋతువు వచ్చిన ఆనందములో రంగులు చల్లుకుని సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. అందుకనే మదన పంచమిగానూ పేరు పొందింది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.
విద్యాధి దేవత అయిన సరస్వతీ దేవి జన్మదినమే శ్రీ పంచమి. అహింసకు అధిదేవత సరస్వతి. సరః అనగా కాంతి. కాంతి కలిగినది కనుక సరస్వతిగా పేర్కొంటారు.అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతులను విరజిమ్మేది సరస్వతి. శ్వేత పద్మాసనాసీనురాలై వీణ, పుస్తకము, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది.
గాయత్రీ దేవి ఐదు రూపాలలో సరస్వతీ దేవి రూపం ఒకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపము వలన విద్యను కోల్పోవడంతో సూర్యదేవుని ఆరాధించగా, సూర్యభగవానుడు ఆతనికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. యాజ్ఞవల్క్యుడు వసంత పంచమి రోజున సరస్వతీ అమ్మవారిని ఆరాధించి ఆమె కృప వలన స్మృతి శక్తిని సంపాదించి మహా విద్వాంసుడు అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. వాల్మీకి సరస్వతీదేవిని ఆరాధించి శ్రీమద్రామాయణం రచించాడు.
వ్యాసుడు అమ్మవారి ఉపాసనతో వేద విభాగం చేసి, పురాణాలను ఆవిష్కరించి, మహాభారత, భాగవత బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషునిగా నిలిచాడు. పోతన తన ఆంధ్ర మహాభాగవతంను సరస్వతీ దేవికి అంకితం చేశారు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.