ఈ దీపావళి నాడు అరుదైన యాదృచ్చికం ఏర్పడుతోంది.. ఈ రాశుల వారికి కాసుల వర్షం, ధనవంతులయ్యే అవకాశం!-special coincidence on diwali 2025 these rasis receive immense wealth and can become rich also check diwali puja timings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ దీపావళి నాడు అరుదైన యాదృచ్చికం ఏర్పడుతోంది.. ఈ రాశుల వారికి కాసుల వర్షం, ధనవంతులయ్యే అవకాశం!

ఈ దీపావళి నాడు అరుదైన యాదృచ్చికం ఏర్పడుతోంది.. ఈ రాశుల వారికి కాసుల వర్షం, ధనవంతులయ్యే అవకాశం!

Peddinti Sravya HT Telugu

ఈ ఏడాది దీపావళి చాలా ప్రత్యేకంగా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈ శుభ యోగాలు వేళ లక్ష్మీదేవిని ఆరాధించడం, కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం వంటివి చేస్తే మంచిది. దీపావళి నాడు లక్ష్మీ పూజ చేయడం వలన డబ్బుకి లోటు ఉండదు. అందుకని వ్యాపారులు కూడా దీపావళి నాడు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

ఈ దీపావళి నాడు అరుదైన యాదృచ్చికం ఏర్పడుతోంది (pinterest)

దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆనందంగా దీపాల మధ్య దీపావళి పండుగను జరుపుకుంటారు, టపాసులు కాల్చుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న, సోమవారం నాడు వచ్చింది. దీపావళి నాడు కొన్ని యాదృచ్చికం కూడా. దీపావళి నాడు ఈ యాదృచ్చికం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి.

ఈ ఏడాది దీపావళి చాలా ప్రత్యేకంగా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఈ శుభ యోగాలు వేళ లక్ష్మీదేవిని ఆరాధించడం, కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించడం వంటివి చేస్తే మంచిది. దీపావళి నాడు లక్ష్మీ పూజ చేయడం వలన డబ్బుకి లోటు ఉండదు. అందుకని వ్యాపారులు కూడా దీపావళి నాడు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.

దీపావళి నాడు ప్రత్యేక యోగాలు:

శని తిరోగమనం:

దీపావళికి శని తిరోగమనంలో ఉండడం ప్రత్యేకమని చెప్పాలి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి మంచి చేస్తుంది. శని కారణంగా వృషభ రాశి వారు, మిధున రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు, సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది.

హంస మహాపురుష రాజయోగం:

దీపావళి నాడు గురువు అదృష్టాన్ని, సంతోషాన్ని తీసుకురాబోతున్నాడు. గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఈ హంస మహాపురుష రాజయోగం ఏర్పడబోతోంది. ఈ మహాపురుష రాజయోగం ఆర్థికపరమైన సమస్యలను తొలగిస్తుంది, గౌరవాన్ని పెంచుతుంది, సక్సెస్‌ను అందుకోవడానికి తోడ్పడుతుంది.

బుధాదిత్య రాజయోగం:

అక్టోబర్ 17న, దీపావళి కంటే ముందు బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించి, బుధుడుతో సంయోగం చెందడంతో ఈ బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. శుక్రుడి రాశిలో ఈ రాజయోగం ఏర్పడబోతుంది. విలాసాలకు, డబ్బుకి లోటు ఉండదు. ఆర్థికపరంగా బాగుంటుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.

కాళాక్షి రాజయోగం:

దీపావళి నాడు శుక్రుడు, చంద్రుడు కన్య రాశిలో సంయోగం చెంది కళాక్షి రాజయోగం ఏర్పడబోతోంది. ఇది మానసిక ప్రశాంతతను తీసుకువస్తుంది. ప్రేమ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది.

ఈ రాశుల వారికి 2025 దీపావళి చాలా మంచిది:

మూడు రాశుల వారికి ఈ సంవత్సరం దీపావళి బాగా శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. వృషభ రాశి, సింహ రాశి, కుంభ రాశి వారు ఈ దీపావళికి మంచి ఫలితాలను పొందుతారు. కెరీర్‌లో కలిసివస్తుంది, ఆర్థికపరంగా బాగుంటుంది.

దీపావళికి లక్ష్మీ పూజ చేసుకోవడానికి సరైన సమయాలు:

అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:43 నుంచి ఉదయం 12:28 వరకు

అమృత కాలం: మధ్యాహ్నం 1:40 నుంచి మధ్యాహ్నం 3:26 వరకు

లక్ష్మీ పూజ ముహూర్తం: రాత్రి 7:08 నుంచి రాత్రి 8:18 వరకు

ప్రదోష కాలం: సాయంత్రం 5:46 నుంచి రాత్రి 8:18 వరకు

వృషభ కాలం: రాత్రి 7:08 నుంచి రాత్రి 9:03 వరకు

నిషిత కాల పూజ: ఉదయం 11:41 నుంచి ఉదయం 12:31 వరకు

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.