Solar Eclipse: మార్చి 29న సూర్యగ్రహణం, ఈ 3 రాశులకు కష్టకాలం!
Solar Eclipse: 2025 మార్చి 29న చైత్ర అమావాస్య నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. సూర్యగ్రహణం ప్రభావంతో ఈ 3 రాశుల వారికి సమస్యలు ఎదురవుతాయి. కనుక ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సమస్యలు తప్పవు.
భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యకిరణాలు భూమిని చేరుకోలేవని అందరికీ తెలుసు. ఈ ద్రుగ్విష్యాన్ని సూర్యగ్రహణం అని అంటారు. ఆకాశంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏదో ఒక విధంగా భూమిపై ఒక ప్రత్యేక సంఘటన జరగడానికి కారణం అవుతుంది.
ఈ సంఘటనలు ఎక్కువగా ప్రతికూలంగా ఉంటాయి. చాలా కాలం పాటు సామాన్య ప్రజలకు ఆందోళనని కలిగిస్తాయి. సమాజంలో భారీ నష్టాలు కలిగించే భూకంపం లేదా రైలు ప్రమాదాలు వంటి వాటికి దారి తీస్తాయి.
సూర్యగ్రహణం ఎవరిని ప్రభావితం చేస్తుంది?
2025 మార్చి 29న చైత్ర అమావాస్య నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఆస్ట్రియా, బార్బడోస్, బెల్జియం, బెర్ముడా, ఉత్తర బ్రెజిల్, కెనడా తూర్పు భాగం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్‌ల్యాండ్, ఐర్లాండ్ మొదలైన దేశాల్లో కనబడుతుంది.
ఈ దేశాలలో కొన్ని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. ఒక పెద్ద నాయకుడు మరణం లేదంటే రెండు దేశాల మధ్య వివాదం, రాజకీయాల్లో పెద్ద తిరుగుబాటు వంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.
భారతదేశంలో ఈ సూర్య గ్రహణం కనిపించదు కాబట్టి పెద్దగా ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఈ సూర్యగ్రహణం వలన జాగ్రత్తగా ఉండాలి. మీనరాశిలో గ్రహణం ఏర్పడనుంది. కన్యా రాశి వారి ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహ రాశి వారికి కూడా ఈ సమయం సమస్యలతో నిండి ఉంటుంది.
సూర్యగ్రహణం ప్రభావంతో ఈ 3 రాశుల వారికి సమస్యలు
1.సింహ రాశి
సింహ రాశి వారికి కొన్ని ఇబ్బందులు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థిక నష్టం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వాదనలకు దూరంగా ఉండాలి. లేకపోతే శత్రువుల వలన ఇబ్బందులు కలగొచ్చు.
2.కన్య రాశి
కన్య రాశి వారికి కూడా ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు రావచ్చు. కొన్ని సమస్యలు, అపార్ధాలు ఆకస్మాత్తుగా తలెత్తవచ్చు. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే భాగస్వామి విషయంలో చర్యలు తీసుకోండి. పెద్ద పెద్ద పనులు ఈ సమయంలో మొదలు పెట్టద్దు.
3.మీన రాశి
మీన రాశి వారికి సూర్య గ్రహణం వలన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మీన రాశి వారికి గ్రహణం వలన గుండె జబ్బులతో బాధపడాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
భారత రాజకీయాలపై సూర్యగ్రహణం ప్రభావం ఉందా?
ఈ గ్రహణాలు కారణంగా భారతీయ రాజకీయాల్లో చెడు వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు ప్రజలకు సమస్యలను కలిగించే అవకాశం ఉంది. ప్రతిపక్షాల కారణంగా కేంద్రం ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ద్రవ్యోల్బణం వలన సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం