Sofa Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో సోఫా ఏ దిశలో ఉండాలి?-sofa vastu tips check which is the correct direction to keep and do not do these mistakes ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sofa Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో సోఫా ఏ దిశలో ఉండాలి?

Sofa Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో సోఫా ఏ దిశలో ఉండాలి?

Peddinti Sravya HT Telugu

Sofa Vastu Tips: వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లను ఉంచడం వలన నష్టాలు కలగకుండా ఉంటాయి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం సోఫా ఏ దిశలో ఉండాలి? ఎటువంటి తప్పులు చేయకూడదు వంటివి తెలుసుకుందాం.

Sofa Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో సోఫా ఏ దిశలో ఉండాలి? (pinterest)

ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తిని వ్యాపిస్తోంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

సోఫా వాస్తు చిట్కాలు

వాస్తు ప్రకారం పాటించాల్సిన కొన్ని నియమాలని ఈరోజు తెలుసుకుందాం. వీటిని కనుక పాటించినట్లయితే మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం సోఫా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడొచ్చు. అనేక లాభాలని పొందవచ్చు.

వాస్తు ప్రకారం సోఫా ఏ దిశలో ఉండాలి?

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లను ఉంచడం వలన నష్టాలు కలగకుండా ఉంటాయి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సోఫా దక్షిణ లేదా పడమర గోడకు వ్యతిరేకంగా ఉంచాలి. అంటే సోఫా ఉత్తరం లేదా తూర్పు వైపు ఫేస్ అయ్యి ఉండేటట్టు ఉంచొచ్చు.

ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు రావు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవ్వవు. ఆర్థిక సమస్యలను నివారించడానికి ఉత్తరం లేదా తూర్పు వైపు సోఫా లేదా భారీ ఫర్నీచర్ ని ఉంచకండి.

లివింగ్ రూమ్ లో సరైన రంగు సోఫా

వాస్తు ప్రకారం ముదురు రంగులు సోఫాలు ప్రతికూల శక్తిని కలిగిస్తాయి. ఇటువంటి సోఫాలని లివింగ్ రూమ్ లో ఉంచడం మంచిది కాదు. కాబట్టి ముదురు రంగు సోఫాలని లివింగ్ రూమ్ లో పెట్టకండి . ముఖ్యంగా ఈ రంగు సోఫాలను తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండడం మంచిది కాదు.

లెదర్ సోఫాలు లివింగ్ రూమ్ లో ఉండకూడదా?

లెదర్ సోఫాలు ట్రెండ్ అయినప్పటికీ వాటిని లివింగ్ రూమ్ లో ఉంచడం మంచిది కాదు. వాస్తు ప్రకారం వీటిని లివింగ్ రూమ్ లో లెదర్ సోఫాలు ఉంచడం వలన ఇబ్బందులు వస్తాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం