నేడే సుబ్రహ్మణ్య షష్టి: సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి స్వామి ఆశీర్వాదాలను పొందండి-slokas and benefits of subhrahmanya ashtakam in the day of subharahmanya shashti ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నేడే సుబ్రహ్మణ్య షష్టి: సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి స్వామి ఆశీర్వాదాలను పొందండి

నేడే సుబ్రహ్మణ్య షష్టి: సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి స్వామి ఆశీర్వాదాలను పొందండి

Ramya Sri Marka HT Telugu

Subhrahmanyashtakam: సుబ్రహ్మణ్య స్వామి శక్తి, మహిమ, రక్షణా శక్తిని మనస్సూర్తిగా కొనియాడేందుకు ఉపయోగించే పవిత్రమైన శ్లోకాలే సుబ్రహ్మణ్యాష్టకం. వీటిని భక్తితో పఠించడం వల్ల శాంతి, ఆరోగ్యం, రక్షణ, ఆధ్మాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు.

సుబ్రహ్మణ్య స్వామి

తేజోరూపి,యుద్ధదైవం,సైనాధిపతిగా పేరుగాంచిన సుబ్రహ్మణ్య స్వామికి హిందూ పురాణాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివపార్వతుల ముద్దుల తనయుడైన కుమారే స్వామినే సుబ్రహ్మణ్య స్వామిగా, మురుగన్ గా, కార్తికేయుడిగా పిలుచుకుంటారు. శక్తి, జ్ఞానం, పరివర్తన, విజయానికి ప్రతీకగా స్వామిని భావిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆధ్మాత్మిక శక్తి, ఆరోగ్యం, శాంతి, ధృఢత్వం, శత్రువులపై విజయం సాధిస్తాయని నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో శక్తివంతమైనది, పవిత్రమైనదిగా భావించేది సుబ్రహ్మణ్యాష్టకం మీ కోసం..

సుబ్రహ్మణ్యాష్టకం ప్రత్యేకత:

అష్టకం అంటే ఎనిమిది భాగాలు అని అర్థం. సుబ్రహ్మణ్య స్వామి పవిత్రను, విశిష్టతను ఎనిమిది భాగాలుగా విభజించి రచించిన శ్లోకాలే సుబ్రహ్మణ్యాష్టకం. దీన్ని పఠించడం వల్ల ఆధాత్మిక శక్తి, పాముల నుంచి రక్షణ, సర్ప దోష నివారణ పొందవచ్చు. కోరిన కోరికలు నెరవేరి, అన్నింటా విజయాన్ని దక్కించుకోవచ్చని నమ్మిక.

సుబ్రహ్మణ్యాష్టకం :

  1. హే స్వామినాథ కరుణాకర దీనబంధో

శ్రీపార్వతీశముఖ పంకజ పద్మబంధో

శ్రీశాదిదేవ గణ పూజిత పాదపద్మ

వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

2. దేవాధిదేవ సుతదేవ గణాధినాథ

దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద

దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే

వల్లీశనాథ మమదేహి కరావలంబమ్

3. నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్

భాగ్యప్రధాన పరిపూరిత భక్తకామ

శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప

వల్లీశనాథ మమదేహి కరావలంబమ్

4. క్రౌంచామరేంద్ర పరిఖండన శక్తిశూల

చాపాదిశాదిశస్త్ర పరిమండిత దివ్యపాణే

శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ

వల్లీశనాథ మమదేహి కరావలంబమ్

5. దేవాధిదేవ రధమండల మధ్య మేథ్య

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్

శూరం నిహత్య సురకోటి భిరీడ్యమాన

వల్లీశనాథ మమదేహి కరావలంబమ్

6. హీరాదిరత్న వరయుక్త కిరీటహార

కేయూర కుండల లసత్కవచాభిరామ

హే వీర తారకజయామర బృంద వంద్య

వల్లీశనాథ మమదేహి కరావలంబమ్

7. పంచాక్షరాది మునిమంత్రిత గాంగతోయై

పంచామృతై: ప్రముదితేంద్రముఖై ర్మునీంద్రై

పట్టాభిషిక్త మఘవక్త నయాసనాథ

వల్లీశనాథ మమదేహి కరావలంబమ్

8. శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా

కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్

సిక్త్వాతు మామవ కళానిథి కోటికాంతా

వల్లీశనాథ మమదేహి కరావలంబమ్

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమా

తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదతః

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్

కోటి జన్మ కృతం పాపం తత్ క్షణాత్ తస్య నశ్యతి

ఇంతటితో సుబ్రహ్మణ్యాష్టకం సమాప్తం