Sleeping Tips: నిద్రపోయేటప్పుడు ఈ నియమాలను పాటిస్తే మీకే మంచిది.. ఈ పొరపాట్లు చేస్తే మాత్రం దరిద్రం పట్టుకుంటుంది..
Sleeping Tips: నిద్రపోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకండి. వీటిని మీరు మార్చుకున్నట్లయితే ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు. నిద్రపోవడానికి కూడా నియమాలు ఏంటి అని ఆశ్చర్యపోవద్దు. వీటిని చూశారంటే మీరు కచ్చితంగా ఈరోజు నుంచి పాటించడం మొదలుపెడతారు.
నిద్రపోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతీ రోజూ ఎన్నో పనులు చేసి అలసిపోయేవారు, రాత్రి హాయిగా నిద్రపోతే తర్వాత రోజు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే యాక్టివ్ గా పనులు చేసుకోవడానికి అవ్వదు. అయితే, నిద్రపోవడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. చాలా మందికి నిద్రపోయేటప్పుడు ఎలాంటి నియమాలని పాటించాలి అనే విషయం తెలియదు.

నిద్రపోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకండి. వీటిని మీరు మార్చుకున్నట్లయితే ఇబ్బందుల నుంచి బయట పడొచ్చు. నిద్రపోవడానికి కూడా నియమాలు ఏంటి అని ఆశ్చర్యపోవద్దు. వీటిని చూశారంటే మీరు కచ్చితంగా ఈరోజు నుంచి పాటించడం మొదలుపెడతారు.
- మనుస్మృతి ప్రకారం నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఎప్పుడూ ఒంటరిగా పడుకోకూడదు. అలాగే దేవాలయంలో లేదా స్మశాన వాటికలో నిద్రపోకూడదు.
- పద్మ పురాణం ప్రకారం పూర్తిగా చీకటిగా ఉన్న ప్రదేశంలో ఎప్పుడూ నిద్రపోకూడదు.
- దేవి భాగవతం ప్రకారం ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం మంచిది.
- విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు ఎక్కువ సమయం నిద్రపోతే వారిని నిద్ర లేపవచ్చు అని చాణక్య చెప్పారు.
- తడి పాదాలతో అస్సలు నిద్రపోకూడదు. పొడి పాదాలతో నిద్రపోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
- మహాభారతం ప్రకారం విరిగిన పడకపై నిద్రపోకూడదు. అలాగే ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం.
- గౌతమ ధర్మ సూత్రం ప్రకారం, నగ్నంగా నిద్రపోకూడదు.
- ఎప్పుడూ పగటిపూట నిద్రపోవడం మంచిది కాదు.
- సూర్యాస్తమయానికి ఒక ప్రహారం తర్వాతే నిద్రపోవాలి.
- మంచం పై తినడం, తాగడం వంటివి చేయకూడదు.
- నిద్రపోయి పుస్తక పఠనం చేస్తే అస్సలు మంచిది కాదు.
- నిద్రపోయేటప్పుడు ఎప్పుడూ దక్షిణం వైపు పాదాలు పెట్టి నిద్రపోకూడదు. యముడు, దుష్ట గ్రహాలు అక్కడ ఉంటాయి.
- ఎడమవైపు నిద్రపోతే స్వస్థత లభిస్తుంది.
- సూర్యోదయము, సూర్యాస్తమయం వరకు నిద్రపోతే రోగి, దరిద్రులు అవుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం