సీతా నవమి ఒక ముఖ్యమైన హిందూ పండుగ. హిందూమతంలో సీతా నవమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రీరాముని భార్య, ఆదర్శ భారతీయ మహిళ సీతాదేవి జన్మదినంగా సీతా నవమిని జరుపుకుంటారు. ఈ రోజున సీతాదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.
పురాణాల ప్రకారం సీతా దేవి ఈ రోజున భూలోకం నుంచి ప్రత్యక్షమైంది. అందుకే ఈ రోజును సీతా జయంతి లేదా సీతా నవమిగా జరుపుకుంటారు. దీనిని జానకి నవమి అని కూడా అంటారు. సీతాదేవిని పూజించడం ద్వారా జీవితంలో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, సద్గుణాలు లభిస్తాయి.
ఈసారి మే 5 సోమవారం నాడు సీతా నవమి వచ్చింది. నవమి తిథి మే 05, 2025 ఉదయం 07:35 గంటలకు మొదలు అవుతుంది. మే 06, 2025 ఉదయం 08:38 గంటలకు ముగుస్తుంది. కనుక మే 5 సోమవారం నాడు సీతా నవమిని జరుపుకోవాలి. ఉదయం 10:58 నుండి 01:38 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. ఈ రోజున సీతాదేవిని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.