Sita Navami 2023 । సీతామాత నామం పరమ పావనం.. సీతానవమి విశిష్టత తెలుసుకోండి!-sita navami 2023 date shubha muhurat janaki jayathi siginficance puja vidhi and all details you need to know ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Sita Navami 2023 Date Shubha Muhurat Janaki Jayathi Siginficance Puja Vidhi And All Details You Need To Know

Sita Navami 2023 । సీతామాత నామం పరమ పావనం.. సీతానవమి విశిష్టత తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu
Apr 28, 2023 05:19 PM IST

Sita Navami 2023: శ్రీరాముని ధర్మపత్ని సీతాదేవి జన్మదినాన్ని సీతా నవమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది సీతానవమి ఏప్రిల్ 29న వస్తుంది. ఈ పర్వదిన విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

Sita Navami 2023:
Sita Navami 2023: (Stock pIc)

Sita Navami 2023: సీతా నవమిని ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల నవమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రీరాముడు అవతరించిన శ్రీరామ నవమికి సరిగ్గా ఒక నెల తర్వాత సీతా నవమి వస్తుంది. దీనినే జానకి జయంతిగా కూడా వ్యవహరిస్తారు. ఈ సంవత్సరం సీతా నవమిని ఏప్రిల్ 29న జరుపుకుటున్నారు. కాగా, వైశాఖ నవమి తిథి ఏప్రిల్ 28న సాయంత్రం 4.01 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 29న సాయంత్రం 6.22 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 29వ తేదీ శనివారం ఉదయ తిథిలో సీతా నవమి పర్వదినాన్ని జరుపుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు

సీతా నవమి శుభ ముహూర్తం

సీతా నవమి శుభ యోగం, శుభ ముహూర్తాల వివరాలు పరిశీలిస్తే, ఇలా ఉన్నాయి..

  • అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12.10 గంటల నుండి మధ్యాహ్న1.01 గంటల వరకు ఉంది.
  • అమృతకాల ముహూర్తం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.47 గంటల వరకు ఉంది.
  • రవి యోగం ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12.47 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 30 ఉదయం 6.11 గంటలకు ముగుస్తుంది.

సీతా నవమి విశిష్టత

లక్ష్మీ దేవి వైశాఖ శుక్ల నవమి నాడు మంగళవారం రోజున పుష్య నక్షత్రమునందు జనక మహారాజు ఇంట్లో సీతగా అవతరించిందని ప్రతీతి. పురాణాల ప్రకారం, జనక మహారాజు తమ రాజ్యంలో వర్షాలు బాగా కురవాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని యాగం చేస్తాడు, ఇందులో భాగంగానే పొలం దున్నుతుండగా మట్టిలో నుంచి ఒక ఒక బంగారు పెట్టె బయటపడుతుంది. ఆ పెట్టె తెరిచి చూడగా అందులో ఒక ఆడబిడ్డ ఉంటుంది. ఆ ఆడబిడ్డను జనకుడు తన కూతురుగా స్వీకరిస్తాడు. జనకుడు దున్నినటువంటి పొలంను సీత అని పిలిచే వారు అందుకే ఆ ఆడబిడ్డ సీతగా నామకరణం పొందింది, మిథిలా రాజు జనకుని కుమార్తె అయినందున ఆమెకు జానకి అనే పేరు కూడా వచ్చింది.

సీతా నవమి ప్రాముఖ్యత ఏమిటి?

శ్రీరాముని ధర్మపత్నిగా సీతా మాత ఆదర్శవంతమైన జీవితాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటారు. ప్రేమ, త్యాగం, స్వచ్ఛతకు, పవిత్రతకు స్వరూపంగా సీతామాతను భక్తితో కొలుస్తారు. శ్రీసీతారాములను భక్తితో ఆరాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారంగా సీతానవమి రోజున స్త్రీలు భక్తితో పూజచేస్తే, భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. భార్యభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది, ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి.

సీతామాత భూమాత అందించిన వరప్రసాదం కాబట్టి ఈరోజున ఈ రోజున శ్రీరామునితో పాటు సీతామాతని పూజించడం వల్ల భూదాన ఫలితంతో పాటు పదహారు మహాదానాల ఫలితం లభిస్తుందని ప్రతీతి.

సీతామాత సాక్ష్యాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి, ఈరోజు ఉపవాసం, పూజలు, జపాలు చేయడం వల్ల అనేక తీర్థయాత్రలతో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇది అదృష్టాన్ని పెంచుతుంది, కష్టాలను తొలగిస్తుంది. జీవితంలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు.

WhatsApp channel

సంబంధిత కథనం