కేతు గ్రహ దోషం అనేది జ్యోతిష్య శాస్త్రంలో కేతుగ్రహం దుష్ప్రభావం వలన కలిగే సమస్యల్ని సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మికత, అనిశ్చితి, ఆత్మాన్వేషణ, గత జన్మ కర్మ ఫలితాలపై ప్రభావం చూపుతుంది. కేతు దోషం ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు, ఆధ్యాత్మిక అసంతృప్తి, అనూహ్య విఘ్నాలు ఏర్పడవచ్చు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
గోచారరీత్యా కేతు గ్రహ దోషం ఉన్నవారు ఈ క్రింది చెప్పిన శాంతులు చేసిన కష్టాలు, బాధలు తొలగి కేతు గ్రహ అనుగ్రహం పొంది సుఖశాంతులతో ఉండవచ్చని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
1. మీ దగ్గరలోని ఆలయాలలో నవగ్రహాలకు ఆయురారోగ్యాలతో 7 సార్లు ప్రదక్షణలు చెయ్యాలని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
2. ఆదివారం రోజున వినాయకునికి అష్టోత్తర పూజ జరిపించాలి.
3. మీ పూజా మందిరములో ఈ క్రింది మంత్రములను 7 సార్లు పఠించవలెను
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః క్రాం క్రీం క్రూం కేతుగణాయ నమః ఓం హ్రీం శ్రీం వరవరద ద్రాం ద్రీం వరప్రదాయ మహామయాయ ఐం క్రోం కేతవే నమః ఓం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం క్లీం సింహికా సంభవాయ శత్రునాశనాయ ధూం ధూం ధూమ రూపాయ స్వాహా .
4. ఏడు మంగళవారములు సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించవలెను.
6. బ్రాహ్మణునికి 1 1/4 కేజి ఉలవలు, చిత్రవర్ణ వస్త్రము దానం ఇవ్వవలెను అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు
7. నవగ్రహాలలో కేతు గ్రహానికి 7 ఒత్తులతో ఆవునేతితో దీపారాధన చేయవలెను.
8. ఏడు ఆదివారాలు వినాయకుని మోదుగపూలు, గరికపత్రి, ఎర్రకలువ పూలతో అష్టోత్తరపూజ జరిపించవలెను.
9. కేతు గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 7సార్లు పఠించవలెను.
కేతుగాయత్రి : కేతగ్రహాయ విద్మహే రౌద్రాంతకాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్
10. కాణిపాకం వెళ్ళి అక్కడ వినాయకున్ని దర్శించి అష్టోత్తర పూజ జరిపించవలెను.
11.1 1/4కేజి ఉలవలను ఆవుకు పెట్టవలెను.
12. వైఢూర్య రత్నాన్ని కుడిచేతికి ధరించిన మంచిది.
13. సంకటహర చతుర్థినాడు వినాయక స్తోత్రాలు పఠించవలెను.
14. మీ గృహములో కేతుగ్రహ హోమం జరిపించవలెను అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
15. ఒక ఆదివారంనాడు ఏడుగురు బీదలకు అన్నదానం చేయవలెను.
16. శ్రీకాళహస్తిలో రాహుకేతువులకు అష్టోత్తరపూజ జరిపించవలెను అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
17. ఆవు పాలతో, సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించవలెను.
18. అశ్వని,మఖ,మూల నక్షత్రములుఉన్న రోజున కేతుగ్రహ మంత్రములను పఠించవలెను.
19.గణపతి పురాణమును, సుబ్రహ్మణ్య చరిత్రను పారాయణ చేయవలెను.
20. ఆవు పాలు, పంచదారలతో చేసిన పిండివంటలను బుధవారం రోజున ఆలయంలో అందరికీ పంచవలెను.
21. కమలా ఫలములు, సపోటాలు, ఖర్జూరములను నివేదన చేసి పంచిన శుభము.
22. తూర్పుగోదావరి జిల్లాలోని అయినవిల్లిలో వినాయకుని దర్శించి 7 కొబ్బరికాయలు కొట్టిన కోరిన కోరికలు నెరవేరును.
23. ప్రతీరోజు గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించవలెను అనిచిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.