Mahabharatam: మహాభారతం గురించి మీకు ఎంత తెలుసు? ఈ క్విజ్‌లో పాల్గొని తెలుసుకోండి
Mahabharatam: మహాభారతం గురించి మీకు ఎంతవరకు తెలుసు? మీకున్న జ్ఞానాన్ని మీరే ఇప్పుడు పరీక్షించుకోండి. కొన్ని సులువైన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ఆ సమాధానాలు తెలుసో లేదో చూడండి.
మహాభారతం ఎంతో గొప్ప కావ్యం. మహాభారతాన్ని ఎంత చదివినా మళ్ళీ చదవాలని అనిపిస్తూ ఉంటుంది. పంచమ వేదంగా హిందువులు మహాభారతాన్ని పరిగణిస్తారు. వేద వ్యాసుడు చెప్తుంటే వినాయకుడు మహాభారతాన్ని లిఖించాడని అంటారు. 18 పర్వాలతో, లక్ష శ్లోకాలతో, పెద్ద పద్య కావ్యాలలో ఒకటి మహాభారతం. మహాభారతాన్ని జీవితంలో ఒక్కసారైనా చదవడం ముఖ్యమని అంటారు. మహాభారతం చదివితే మనిషి ఎలా జీవించాలి అనేది కూడా తెలుస్తుంది.
మహాభారతాన్ని దేవనాగరి లిపి అయినటువంటి సంస్కృత భాషలో రచించారు. 14వ శతాబ్దంలో కవిత్రేయంగా పేరు పొందిన నన్నయ్య, తిక్కన, ఎర్రన్నలు తెలుగులోకి అనువదించడం జరిగింది. ఇతిహాసం కథని మొదట తక్షశిల దగ్గర వ్యాస మహర్షి శిష్యుడు వైసంపాయిన అనే రుషి అర్జునుడు మనవడు అయినటువంటి జనమే జయరాజుకు వినిపించాడు. ఈ కథని చాలా ఏళ్ల తర్వాత సౌనకుడు అనే పురాణ కధకుడు మళ్ళీ వినిపించాడు. నైమిశారణ్యం అనే అడవిలో సౌనక కులపతి ఋషులకు తెలిపారు.
మహాభారతంలో మనకి తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ప్రాచీన భారతీయ ఇతిహాసం ఇది. కౌరవులు, పాండవులు, శ్రీకృష్ణుడు ఇలా మహాభారతం అంటే మనకి గుర్తొస్తూ ఉంటాయి. మీరు కూడా మహాభారతాన్ని చదివారా? మహాభారతం గురించి మీకు ఎంతవరకు తెలుసు? మీకున్న జ్ఞానాన్ని మీరే ఇప్పుడు పరీక్షించుకోండి. కొన్ని సులువైన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. ఆ సమాధానాలు తెలుసో లేదో చూడండి.
1. కృష్ణుడి సోదరుడు ఎవరు?
2. వరుణుడిచ్చిన ఆయుధం ఎవరి దగ్గర ఉంది?
3. ద్రోణాచార్యుడు కొడుకు పేరు ఏంటి?
4. బ్రహ్మాస్త్రం కంటే బ్రహ్మ సృష్టించిన శక్తివంతమైన ఆయుధం ఏది?
5. పాండురాజు తల్లి ఎవరు?
6. భీష్ముని తల్లి పేరు ఏంటి?
7. అర్జునుడు విల్లు పేరు ఏమిటి?
8. భీష్ముడు తండ్రి పేరు ఏమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే మహాభారతం మీద కాస్త పట్టు ఉన్నట్లు అర్ధం. ఒకవేళ మీకు సమాధానాలు తెలియలేదా అయితే ఇదిగో ఇక్కడ తెలుసుకోవచ్చు.
1. కృష్ణుడి సోదరుడు పేరు బలరాముడు.
2. వరుణుడిచ్చిన ఆయుధం అర్జునుడు దగ్గర ఉంది.
3. ద్రోణాచార్యుడు కొడుకు పేరు అశ్వద్దాముడు.
4. బ్రహ్మాస్త్రం కంటే బ్రహ్మ సృష్టించిన శక్తివంతమైన ఆయుధం బ్రహ్మశిర:
5. పాండురాజు తల్లి పేరు అంబాలిక.
6. భీష్ముని తల్లి పేరు గంగా దేవి.
7. అర్జునుడి విల్లు పేరు గాండీవం.
8. భీష్ముడు తండ్రి పేరు శంతను.
సంబంధిత కథనం