అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలా? అయితే ఈ 6 వాస్తు చిట్కాలను ట్రై చేయండి, ఇక సమస్యలు తీరినట్టే!-simple 6 vastu tips to get out from debts and to stay healthy with happiness ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలా? అయితే ఈ 6 వాస్తు చిట్కాలను ట్రై చేయండి, ఇక సమస్యలు తీరినట్టే!

అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలా? అయితే ఈ 6 వాస్తు చిట్కాలను ట్రై చేయండి, ఇక సమస్యలు తీరినట్టే!

Peddinti Sravya HT Telugu

వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం మంచిది. సానుకూల శక్తి ప్రవేశిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.

అనారోగ్య సమస్యలు, అప్పుల బాధల కోసం వాస్తు చిట్కాలు (pinterest)

ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండాలని చూస్తారు. ఏ ఇబ్బంది రాకుండా ఉండాలంటే వాస్తు ప్రకారం అనుసరిస్తే మంచిది. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవేశిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంతోషంగా ఉండవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన చాలా సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం మంచిది. మనకు తెలియకుండా జరిగే కొన్ని పొరపాట్ల వలన కూడా ఇటువంటి ఇబ్బందులతో సతమతం కావాల్సి వస్తుంది. అప్పుల బాధలు తీరాలన్నా, అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలన్నా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి.

వాస్తు ప్రకారం అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  1. దక్షిణం యమ ధర్మరాజు దిక్కు. ఈ దిశలో పొరపాటున కూడా మంచాన్ని పెట్టకండి. దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోవడం కూడా మంచిది కాదు. ఒకవేళ మీరు నిద్రపోయేటప్పుడు దక్షిణం వైపు తల పెడితే తలనొప్పి, కాళ్ళు నొప్పులు లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశలో తలపెట్టి నిద్రపోవడం మంచిది కాదు.
  2. ఇంట్లో గాలి, వెలుతురు బాగా వచ్చేటట్లు చూసుకోవాలి. అందుకు తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది.

అప్పుల సమస్యలు

  • మెట్లు: అప్పుల బాధ నుంచి బయటపడాలని అనుకుంటే ఇంటికి పశ్చిమం వైపు మెట్లు ఉండకుండా చూసుకోవాలి. అలా ఉంటే ప్రతికూల శక్తి ప్రవహించి అప్పుల సమస్యని ఎదుర్కోవాలి.
  • స్టవ్: ఇంట్లో స్టవ్ కానీ, సిలిండర్ కానీ వాస్తు ప్రకారం తూర్పు వైపు పెట్టాలి. ఇలా ఉంటే జీవితంలో ఆనందం కలుగుతుంది. శ్రేయస్సు, సంతోషం కూడా ఉంటాయి.
  • మంగళవారం అప్పు చెల్లించండి: మంగళవారం నాడు అప్పు తీర్చండి. అప్పు తీసుకుని ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకుంటే, మంగళవారం నాడు మొదటి వాయిదా చెల్లించడానికి ట్రై చేయండి. వాస్తు ప్రకారం ఇలా చేయడం వలన అంగారక గ్రహం అనుగ్రహంతో త్వరగా అప్పులు తీర్చవచ్చు.
  • తులసి మొక్క: తులసి మొక్కని లక్ష్మీదేవిగా భావిస్తారు. తులసి మొక్కని ప్రతి రోజు ఇంట్లో పూజించడం వలన ఆర్థిక ఇబ్బందులు ఉండవు. డబ్బు కలిగి, సంతోషంగా ఉండొచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.