Simha Rasi Today: సింహ రాశి వారు ఈరోజు ఒక గొప్ప శుభవార్త వింటారు, విలాసాలకి డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్త
Leo Horoscope Today: రాశిచక్రంలో 5వ రాశి సింహ రాశి. పుట్టిన సమయంలో సింహ రాశిలో సంచరిస్తున్న జాతకుల రాశిని సింహ రాశిగా పరిగణిస్తారు. సింహ రాశి వారికి ఈరోజు ఆగస్టు 29, 2024న ఆరోగ్యం, కెరీర్, ఆర్థిక, ప్రేమ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
Simha Rasi Phalalu 29th August 2024: ఈ రోజు సింహ రాశి వారికి ప్రేమ వ్యవహారంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు ఉద్యోగంలో ఈ రోజంతా బిజీగా ఉంటారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు ప్రేమ వ్యవహారంలో దూకుడుగా ప్రవర్తించకండి. ఆఫీసులో టీమ్ కోసం మీ వంతు కృషి చేయడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ప్రేమ
ఈ రోజు మీ ప్రేమ బంధాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లండి. మూడో వ్యక్తి జోక్యం, వారితో వాదనలకి దూరంగా ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి ఉండండి. మీ భాగస్వామిపై బలవంతంగా మీ అభిప్రాయాలను రుద్దవద్దు. ఈ రోజు కలిసి డిన్నర్ చేయడానికి ప్లాన్ చేయండి. స్త్రీలు ఈ రోజు గర్భం దాలుస్తారు. కొంతమంది సింహ రాశి వారు తమ జీవిత భాగస్వామి బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు.
కెరీర్
సింహ రాశి వారు ఈ రోజు తమ ఉద్యోగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. టీమ్ ప్రాజెక్ట్స్ లో మీ పాత్ర కీలకం. ఈ రోజు టీమ్ మీటింగ్‌లో మీ అభిప్రాయాలను వ్యక్తీకరించండి. ఈరోజు కొన్ని పనులపై అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొంతమంది ఉద్యోగార్థులు కొత్త ఉద్యోగం పొందుతారు. మీరు భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం సరైన సమయం.
ఆర్థిక
సింహ రాశి వారికి ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది. కానీ మీ ఖర్చులను నియంత్రించడం ఈరోజు కీలకం. విలాస వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయకండి. బదులుగా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయండి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు మంచి సమయం. కుటుంబంలో చిన్నచిన్న ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.ఈరోజు ఆస్తి పంపకాల విషయంలో సోదరసోదరీమణులు కలత చెందుతారు. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించండి. వ్యాపారస్తులు నిధుల సేకరణలో విజయం సాధిస్తారు.
ఆరోగ్యం
ఈ రోజు సింహ రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ జీవనశైలిని క్రమశిక్షణతో కొనసాగించండి. వ్యాయామాన్ని అలవాటు చేసుకోండి. బిజీ కారణంగా భోజనాన్ని అవాయిడ్ చేయొద్దు. పుష్కలంగా నీరు తాగాలి. ఈ రోజు జీర్ణ సమస్యలు ఉండవచ్చు. ఆడుకునేటప్పుడు పిల్లలు గాయపడవచ్చు మహిళలకు మైగ్రేన్ సమస్యలు వస్తాయి. ఈ రోజు జిమ్‌లో చేరడానికి మంచి రోజు.