Dharma Sandehalu: ఇతరుల చెప్పులు మనం వేసుకుంటే వాళ్ల దరిద్రం మనకు వస్తుందా? ఇందులో నిజమెంత?
Dharma Sandehalu: "వేరే వాళ్ల చెప్పులు మనం వేసుకుంటే వాళ్ల దరిద్రం మనకు వస్తుంది" ఇది కొన్ని తరాలుగా మనం వింటున్న మాట. పూర్వీకులు తరచూ చెప్పే ఈ మాటలో నిజమెంత, అబద్ధమెంత అని మీరెప్పుడైనా ఆలోచించారా..?
ఇతరుల చెప్పులు వేసుకోవడం వల్ల వారి దరిద్రం మనకు వస్తుందని తరచూ పూర్వీకులు చెబుతుంటారు. ఇది కేవలం శుభ్రతకు సంబంధించిన విషయమేనా లేక దీని వెనుక ఆథ్యాత్మిక కోణం ఏమైనా ఉందా? హైందవ ధర్మంలో, జ్యోతిష్య శాస్త్రంలో ఒకరి చెప్పులు ఇంకొకరు ధరించడం గురించి కొన్ని విషయాలు పొందుపరిచారు. వాటి ప్రకారం ఒకరి చెప్పులు మరొకరు వేసుకోవడం వల్ల జరిగే పరిణామాలు వ్యక్తి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మారుతుందట.ఇదే విషయం గురించి జ్యోతిష్య శాస్త్రం మరో రకమైన ప్రతీకాత్మక భావనను సూచిస్తుంది. ఇది శరీరానికి, ఆత్మకు లేదా కర్మకు సంబంధించిన ప్రతికూల ప్రభావాలు ఒకరి నుంచి మరొకరికి వెళ్లడమని చెబుతుంది. ఒకరి బాధలను, సంతోషాన్ని మరొకరు అనుభవించడమని వివరిస్తుంది. ఇంకా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకరి చెప్పులు మరొకరు వేసుకోవడం వల్ల కలిగే పరిణామాలు:
1. కర్మ:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్మ అనేది వ్యక్తి జీవితంలో అనేక దారులను తెరిచే లేదా మూసివేసేందుకు ముఖ్యమైన అంశం. పూర్వజన్మలో చేసిన కర్మలు ప్రస్తుత జీవితంలో ఫలితాలను నిర్దేశిస్తాయి. కానీ కొన్ని సందర్భాలలో, ఇంకొకరి కర్మ కూడా మన మీద ప్రభావం చూపవచ్చు. ఇతరుల చెప్పులు వారి అనుమతి లేకుండా మనం ధరించడం వల్ల వారి కర్మ ఫలితాలు కూడా మనకు చుట్టుకుంటాయి. అదే విషయంలో అవి దొంగిలించి వాడుకుందామనుకుంటే చేతులారా స్వీయ సంతోషాన్ని, శాంతిని హరించుకున్నట్లే. ఇలా చేయడం వల్ల జీవితంలో మనకు రావాల్సిన అదృష్టం కూడా తగ్గిపోతుంది. ఆధ్మాత్మికంగానూ శాపంగా మారి ప్రశాంతత కరువవుతుంది. దీనినే "కర్మ చక్రం" అంటారు. అంటే ఈ పనుల ఫలితాలు మళ్లీ మనల్ని లేదా మన పరిచయులను ప్రభావితం చేస్తాయి.
2. గ్రహాల ప్రభావం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంపై శని, రాహు, కేతులు కీలక ప్రభావం చూపిస్తాయి. ఎవరైనా శని లేదా రాహు ప్రభావానికి గురైతే, ఆ ప్రభావం ఇతరులపై కూడా కనిపించవచ్చు. కాబట్టి ఒకరి అనుభవాలు, బాధలు, ఇతర వ్యక్తుల జీవితాల్లో కూడా కనిపించవచ్చు. ఈ సందర్భంలో, ఒకరి చెప్పులు ఇంకొకరు ధరించడం అనేది గ్రహాలపై ప్రభావం చూపిస్తాయి. ఆ చెప్పులు ధరించిన వారు చేసిన అశుభ కర్మలు ఇతరులకు విపరీతంగా ఫలితాలు చూపించవచ్చు.
3. పరిస్థితుల మార్పు:
వేరొక వ్యక్తులకు ఇతరులు చేసిన కష్టాలు, బాధలు మనమీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదాహరణకి, ఆ చెప్పుల యజమాని వల్ల ఒక వ్యక్తి కష్టం లేదా బాధనో, సమస్యనో ఎదుర్కొన్నాడనుకుందాం. ఆ ఫలితం అతని చెప్పులు ధరించిన మరొకరి మీద కూడా పడుతుందట. ఇది సంఘటనల వల్ల కలిగే ఫలితం. అనేక సందర్భాల్లో అభిప్రాయాల మార్పు లేదా బాధ ఈ విధంగా ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది.
సాంప్రదాయంగా ఒకరి చెప్పులు ఇంకొకరు ధరించడం అనేది కర్మలోని ప్రతికూల ఫలితాలను లేదా పరిణామాల ప్రభావాన్ని సూచిస్తుంది. ఇది ఆధ్యాత్మికంగా కష్టాలు, పరిస్థితుల మార్పు లేదా మొత్తం జీవన శక్తులపై ప్రభావం చూపిస్తుంది. చెప్పులు అనేవి ప్రతి వ్యక్తి స్వతంత్ర్యత, సమృద్ధిని సూచిస్తాయి. అంటే, చెప్పులు దొంగిలించడం వల్ల ఆ వ్యక్తి బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఇంకొకరు తీసుకెళ్లిపోయారనే అర్థమే వస్తుంది. అంటే ఆర్థిక కష్టాలు, పరిస్థితుల ప్రతికూలతలు లేదా శ్రేయస్సు కోల్పోవడం అనే దిశలో ఫలితాలను కలిగి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.