Shukraditya yogam: సింహ రాశిలో శుక్రాదిత్య యోగం, ఈ రాశుల వ్యాపారులకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు-shukraditya yogam in simha rashi three zodiac signs get huge profitis in business ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shukraditya Yogam: సింహ రాశిలో శుక్రాదిత్య యోగం, ఈ రాశుల వ్యాపారులకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు

Shukraditya yogam: సింహ రాశిలో శుక్రాదిత్య యోగం, ఈ రాశుల వ్యాపారులకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు

Gunti Soundarya HT Telugu
Aug 21, 2024 04:59 PM IST

Shukraditya yogam: సింహ రాశిలో సూర్యుడు, శుక్రుడి కలయిక వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడింది. దీని ప్రభావంతో మూడు రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో వీళ్ళు చేసే వ్యాపార ఒప్పందాలు భారీ ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి. అవి ఏ రాశులకో చూసేయండి.

సింహ రాశిలో శుక్రాదిత్య యోగం
సింహ రాశిలో శుక్రాదిత్య యోగం

Shukraditya yogam: గ్రహాల సంచరాలు ప్రజల జీవితాలపై సానుకూల, ప్రతికూల ప్రభావం చూపుతాయి. అన్ని గ్రహాలు నిర్ధిష్ట సమయం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ శుభ యోగాలను, అశుభయోగాలను ఏర్పరుస్తాయి. ఆగస్ట్ నెలలో సూర్యుడు, శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగాన్ని ఇస్తున్నారు. 

ఆగస్ట్ 16 నుంచి సూర్యుడు సింహ రాశిలో సంచరిస్తున్నాడు. ఇప్పటికే అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఆగస్టు 25 వరకు శుక్రుడు ఇదే రాశిలో ఉంటాడు.  శుక్రాదిత్య యోగం సూర్యుడు, శుక్రుడి కలిసినప్పుడు ఏర్పడుతుంది. సూర్యుడికి ఉన్న మరొక పేరే ఆదిత్యుడు. అందువల్లే ఈ యోగాన్ని శుక్రాదిత్య యోగం ఉంటారు. ప్రస్తుతం శుక్రాదిత్య యోగం ఆగస్ట్ 25వరకు ఉంటుంది. తర్వాత శుక్రుడు తన సొంత రాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. వారి పని రంగంలో విజయాన్ని పొందుతారు. అనేక రంగాలలో రెట్టింపు పురోగతి ఉంటుంది. శుక్రాదిత్య యోగం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలుగుతుందో చూద్దాం. 

సింహ రాశి

సింహ రాశి లగ్న గృహంలో శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం సానుకూల ప్రభావం కారణంగా వీరికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గత కొంత కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలోని అడ్డంకులను అధిగమిస్తారు. ఒంటరి వ్యక్తులకు వివాహం ఫిక్స్ అవుతుంది. ఉద్యోగస్తులకు తగిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలను గడిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ సంతోషకరంగా ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

తులా రాశి

తులా రాశి లాభ, ఆదాయ గృహంలో శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో వీళ్ళు అధిక ప్రయోజనాలను పొందుతారు. ఆదాయ స్థాయి పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఉద్యోగస్తుల నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడతాయి. కార్యాలయంలో విజయాలు సాధిస్తారు. భారీగా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. వ్యాపారులకు పురోగతికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. అలాగే వ్యాపారాలను విస్తరించుకునే ప్రణాళికలు ఈ సమయంలో అమలు చేసుకోవచ్చు. ఈ సమయంలో చేసుకునే వ్యాపార ఒప్పందాలు భారీ లాభాలను అర్జించే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. 

వృశ్చిక రాశి

శుక్రాదిత్య యోగం వృశ్చిక రాశి కర్మ గృహంలో ఏర్పడుతుంది. ఇది వీరికి అనుకూలమైన కాలం.  వివిధ ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు.  ఉద్యోగస్తులు కార్యాలయంలో కొన్ని మార్పులు ఉంటాయి. నిరుద్యోగులు తమకు నచ్చిన ఉద్యోగాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.  సంపద స్థాయిలు పెరుగుతాయి. ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు చేసుకునే వివిధ ఒప్పందాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి సహొద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. అలాగే కార్యాలయంలో కొత్త బాధ్యతలను అందుకుంటారు. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.