సాయంత్రం దీపం వెలిగించడానికి స్నానం చేయాలా?
సాయంత్రం దీపం వెలిగించడానికి స్నానం చేయాలా? ఎప్పుడు చేయాలి? తదితర విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
సాయంత్రం దీపం వెలిగించడానికి స్నానం చేయాలా? అన్న ప్రశ్న తరచూ తలెత్తుతుంది. రెండుపూటలా స్నానం చేయడం మంచిదే. సూర్యోదయం సమయంలో, సాయంత్రం సూర్యాస్తమయానికి కాస్త ముందుగా దీపం పెట్టడం తప్పనిసరిగా చేయాలి.
ఉదయం అయితే స్నానం చేస్తారు. శుచిగా ఉంటారు. కానీ సాయంకాలం అయ్యే సరికి స్నానం చేయాలా అన్న సందేహం కలుగుతుంది. పగలు పూర్తయ్యేటప్పుడు సూర్యుడు తన తేజస్సును అగ్నిలో పెట్టి వెళతాడని విశ్వాసం. అందుకే సూర్యాస్తమయ సమయానికి దీపం పెడితే సూర్య తేజస్సు అందులో ఉంటుందని విశ్వాసం.
దైవ కార్యం చేసేటప్పుడు శుచిగా ఉండాలి. అశౌచ్యం లేకుండా సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండి, ఎక్కడా తిరగకుండా శుచిగా ఉన్నప్పుడు స్నానం ఆచరించాల్సిన పనిలేదు. కాళ్లూ చేతులు కడుక్కుంటే సరిపోతుంది. ఒకవేళ కాలకృత్యాలకు వెళ్లి ఉంటే ఉతికిన దుస్తులు ధరించాలి. ఈ సమయంలో తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. స్త్రీలైతే కంఠస్నానం సరిపోతుంది.
సాయంత్రం దీపం వెలిగించి ఇష్ట దేవత ప్రార్థన చేయాలి. నేర్చుకున్న శ్లోకాలను పారాయణం చేయాలి. దీపారాధన చేసే సమయంలో చెప్పాల్సిన శ్లోకం ఇక్కడ చూడండి.
దీపారాధన శ్లోకం
దేవీం షోడశవర్షీయాం శశత్సుస్థిర యౌవనాం
బింబోష్ఠీం సుదతీమ్ శుద్ధామ్ శరత్ పద్మ నిభాననామ్
శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పల లోచనామ్
జగద్ధాత్రిమ్ చ ధాత్రిమ్ చ సర్వేభ్య సర్వ సంపదామ్
సంసార సాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే
టాపిక్