ప్రతి సంవత్సరం గొప్ప వైభవంగా మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. మాఘ కృష్ణ పక్షం, త్రయోదశి తిథి ఉదయం 11:08 గంటలకు ప్రారంభమై, ఫిబ్రవరి 27, 2025 ఉదయం 08:54 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం, ఈ రోజు మహాశివరాత్రి వ్రతం ఉండి రాత్రి నాలుగు జాముల పూజ చేయాలి.
మహాశివరాత్రి రోజు కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా శివుని ప్రసన్నం చేసుకోవచ్చు. శాస్త్రాల ప్రకారం, ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వేయి అశ్వమేధ యజ్ఞాలు, నూరు వాజపేయ యజ్ఞాల ఫలితం లభిస్తుంది. మహాశివరాత్రి రోజు గంగా స్నానం చేసి, గంగజలంతో శివలింగాన్ని అభిషేకించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజు శివ పంచాక్షర స్తోత్రం, శివసహస్రనామం, మహామృత్యుంజయ జపం చేయడం చాలా శుభప్రదం. మీ రాశి ప్రకారం, ఈరోజు మహాశివరాత్రి నాడు శివుడికి ఏమి అర్పించాలి తెలుసుకుందాం.
మేష రాశి: తేనె మరియు చక్కెరతో అభిషేకం చేయండి
వృషభ రాశి: పెరుగు, పాలు, నెయ్యితో అభిషేకం చేయండి
మిధున రాశి: బిల్వపత్రాలు, ఎర్రటి పూలు, పంచామృతంతో అభిషేకం చేయండి
కర్కాటక రాశి: తెల్లని వస్త్రం, పాలతో అభిషేకం చేయండి
సింహ రాశి: తేనె, బెల్లంతో అభిషేకం చేయండి
కన్య రాశి: బిల్వ పత్రాలు మరియు తేనెతో అభిషేకం చేయండి
తుల రాశి: చెరకు రసం, నెయ్యితో అభిషేకం చేయండి
వృశ్చిక రాశి: ఎర్రటి పూలు, గంగాజలంతో అభిషేకం చేయండి
ధనుస్సు రాశి: చందనం, పసుపు పూలు, పంచామృతంతో అభిషేకం చేయండి
మకర రాశి: బిల్వపత్రాలు, గంగాజలంతో అభిషేకం చేయండి
కుంభ రాశి: పెరుగు, పంచదారతో అభిషేకం చేయండి
మీన రాశి: ఉసిరి, తేనెతో అభిషేకం చేయండి
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం