Lucky zodiac signs: 30 ఏళ్ల తర్వాత రెండు అద్భుతమైన రాజయోగాలు.. ఈ ఐదు రాశులకు డబుల్ అదృష్టమే
Lucky zodiac signs: దాదాపు 30 ఏళ్ల తర్వాత రెండు గ్రహాలు అద్భుతమైన రాజయోగాలు అందిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఐదు రాశుల వారికి అదృష్టం రెట్టింపు కబోతుంది.

Lucky zodiac signs: జ్యోతిష్య శాస్త్రంలో కొన్నిసార్లు రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు ఒకదానితో ఒకటి సంయోగం చెందుతాయి. ఈ గ్రహాల కలయిక ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే యోగాలను సృష్టిస్తుంది.
30 ఏళ్ల తర్వాత అద్భుతమైన అత్యంత శుభకరమైన శశ, మాలవ్య రాజయోగం ఏర్పడ్డాయి. ఈ రెండు యోగాలు శని, శుక్ర గ్రహాల సంచారం వల్ల జరుగుతున్నాయి. వీటి ప్రభావం 12 రాశి చక్రాలపై కనిపిస్తుంది కానీ కొన్ని రాశిచక్రాలు ఈ రాజయోగాల నుండి అపారమైన అదృష్టాన్ని పొందబోతున్నాయి.
ఈ యోగాలు ఎలా ఏర్పడతాయి?
శని ప్రస్తుతం తన స్వగృహమైన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇది శశ రాజ యోగాన్ని ఇచ్చింది. ఇక శుక్రుడు మే 19 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఫలితంగా మాలవ్య రాజయోగం సృష్టించాడు. వృషభం, తులా రాశి లేదా ఉన్నతమైన మీన రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీన్ని ఐశ్వర్య గ్రహంగా పరిగణిస్తారు.
శుక్రుడి శుభ ప్రభావం వల్ల ఒక వ్యక్తి ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. ఒక వ్యక్తి జాతకంలో మొదటి, నాలుగు, ఏడు లేదా పదో ఇంట్లో శుక్రుడు సంచరిస్తున్నప్పుడు ఈ రాజయోగం ఫలితాలు పొందుతాడు.
ఇక శని కుంభం, మకరం లేదా ఉన్నతమైన తులా రాశిలో ఉన్నప్పుడు శశ రాజయోగం ఏర్పడుతుంది. ఈ ఏడాది మొత్తం శని శశ రాజయోగాన్ని ఇస్తున్నాడు. ఈ రెండు రాజయోగాల ప్రభావంతో ఐదు రాశుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రెండు యోగాలు చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తాయి. ఆధ్యాత్మికత వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఈ వ్యవధిలో మతపరమైన యాత్రలు కూడా ప్లాన్ చేసుకుంటారు. కెరీర్ వేగంగా అభివృద్ధి చెందుతారు. మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. కార్యాలయంలో ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. సీనియర్లను మీ పనితో ఆకట్టుకుంటారు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదృష్టం తోడుగా ఉండటం వల్ల వ్యాపారాలు నడుపుతున్న వారికి కూడా గొప్ప లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలో మీ పేరుతో ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కూడా ఫిట్ గా ఉంటారు.
కర్కాటక రాశి
శశ, మాలవ్య రాజయోగాలు కర్కాటక రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సమయంలో కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ తో పాటు జీతంలో ఇంక్రిమెంట్ కూడా పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలను గమనిస్తారు. డబ్బు కొరత ఉండదు. అనేక ఆదాయ వనరుల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలతో కొన్ని మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటారు. భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు ఈ కాలంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి శశ, మాలవ్య రాజయోగం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక లాభాలతో సంతోషంగా ఉంటారు. విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కల సాకారం కానుంది. సొంత వ్యాపారాన్ని నడుపుతున్న వాళ్ళు దానిలో గొప్ప లాభాలు పొందుతారు. ఆదాయ వనరుల నుండి డబ్బును పొందుతారు. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ కాలంలో ఊహించని విధంగా రాబడి పొందే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడంలో విజయం సాధిస్తారు. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్న వివాహితులకు ఈ వ్యవధిలో శుభవార్తలు అందుతాయి.
తులా రాశి
ఈ రెండు రాజయోగాలు తులా రాశి వారిని సమృద్ధిగా ఆశీర్వాదం కురిపిస్తాయి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. విదేశీ ఆదాయ వనరుల నుండి అద్భుతంగా డబ్బు సంపాదించే అవకాశాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్ట్ చేతికి అందుతుంది. మీ శక్తి సామర్థ్యాలతో ఉత్తమమైన ప్రదర్శన ఇస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీకు ఇష్టమైన కారును కూడా కొనుగోలు చేస్తారు. కొత్త భూమి లేదా ఆస్తిలో పెట్టుబడులు పెడతారు. ఫ్యాషన్ డిజైనింగ్, మీడియా రంగంలో ఉన్నవారికి పెద్ద ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి రెండు రాజయోగాలు అదృష్టాన్ని ఇస్తాయి. కార్యాలయంలో గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగంలో విజయం, శ్రేయస్సు లభిస్తుంది. వ్యాపార రంగంలో పనిచేసే వారికి ఈ గ్రహ సంచారాలు అనుకూలంగా పనిచేస్తాయి. చాలా డబ్బును కూడబెట్టగలుగుతారు. మీ ప్రేమ జీవితంలో భాగస్వామితో సంబంధం చాలా బలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ రెండూ లభిస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయి.