శని ఏప్రిల్ 28 నుంచి ఈ 5 రాశులకు ఆదాయాన్ని పెంచుతాడు.. ఇకపై కష్టాలు తీరి, సంతోషంగా ఉంటారు!-shani will bring lots of luck wealth to these 5 rasis from april 28th check whether your rasi is there are not ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శని ఏప్రిల్ 28 నుంచి ఈ 5 రాశులకు ఆదాయాన్ని పెంచుతాడు.. ఇకపై కష్టాలు తీరి, సంతోషంగా ఉంటారు!

శని ఏప్రిల్ 28 నుంచి ఈ 5 రాశులకు ఆదాయాన్ని పెంచుతాడు.. ఇకపై కష్టాలు తీరి, సంతోషంగా ఉంటారు!

Peddinti Sravya HT Telugu

శని త్వరలో ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి సంచరిస్తాడు. శని సంచారం మొత్తం 12 రాశుల పై ప్రభావం చూపిస్తుంది. ఐదు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకు వస్తుంది. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

శని సంచారం

శని మీన రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు నక్షత్ర మార్పు చేస్తాడు. శని నక్షత్ర మార్పు కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. శిక్షాకారుడు శని మకర రాశిలో ఉన్నాడు. త్వరలో ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి సంచరిస్తాడు. శని సంచారం మొత్తం 12 రాశుల పై ప్రభావం చూపిస్తుంది. ఐదు రాశుల వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

శని నక్షత్ర మార్పుతో ఈ 5 రాశుల వారికి ఊహించని లాభాలు

శని ఏప్రిల్ 28న ఉత్తరాభాద్రపద నక్షత్రంలో సంచరిస్తాడు. అక్టోబర్ 3, 2025 వరకు ఈ నక్షత్రంలోనే సంచరిస్తాడు. ఇది కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

1.వృషభ రాశి

శని నక్షత్ర సంచారం వృషభ రాశి వారికి ఊహించని లాభాలను తీసుకువస్తుంది. వృషభ రాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కెరీర్ లో కూడా మార్పులు వస్తాయి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశం ఉంది.

2.మిధున రాశి

మిధున రాశి వారికి శని నక్షత్ర సంచారం అనేక లాభాలను తీసుకువస్తుంది. ఎప్పటినుంచో పూర్తి కాని పనులు పూర్తవుతాయి. సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. పెద్ద బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సమయం మీకు కలిసి వస్తుంది.

3.కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శని నక్షత్ర సంచారం ఊహించని లాభాలను తీసుకువస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. పని ప్రదేశంలో గుర్తింపు వస్తుంది. ఇదివరకు ఇన్వెస్ట్ చేసిన వాటి నుంచి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందుతారు.

4.మకర రాశి

మకర రాశి వారికి శని నక్షత్ర సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ టాలెంట్ ఇంకా మెరుగు పడుతుంది.

5.కుంభ రాశి

కుంభ రాశి వారికి శని నక్షత్ర సంచారం ఊహించని లాభాలను తీసుకువస్తుంది. పని ప్రదేశంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కెరియర్ లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రమోషన్లు వస్తాయి. ఇంక్రిమెంట్లను అందుకుంటారు. డబ్బుల్ని పొదుపు చేస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం