Shani Venus Conjunction: మీనంలో శుక్రుడు, శని కలయిక.. ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం
Shani Venus Conjunction: మీనంలో శుక్రుడు, శని కలయిక అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశుల వారికి యోగ ఫలాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అది ఏ రాశుల వారికి చెందుతుందో ఇక్కడ చూద్దాం.
జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాలు ఎల్లప్పుడూ తమ స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి.జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 రాశుల వారు గ్రహాల మార్పులను బట్టి ప్రభావితమవుతారు. కొన్నిసార్లు కొన్ని గ్రహాలు కలిసే పరిస్థితులు తలెత్తుతాయి. అప్పుడు కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు లభిస్తాయి.కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయి.
మార్చి 28న, తొమ్మిది గ్రహాలలో నీతిమంతుడైన శని మీనంలో సంచరిస్తాడు. ఆ సమయంలో, శని భగవానుడు ఇప్పటికే మీన రాశిలో సంచరిస్తున్న శుక్ర భగవానుడితో కలుస్తాడు.
మీనంలో శని, శుక్రుల కలయిక 30 సంవత్సరాల తరువాత జరుగుతుంది.మీన రాశిలో శుక్రుడు, శని కలయిక వలన అన్ని రాశుల వారికి యోగ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అది ఏ రాశిలో ఉందో ఇక్కడ చూద్దాం.
1.మీన రాశి
మీన రాశి మొదటి ఇంట్లో శని, శుక్రుల కలయిక వల్ల ఇతరుల పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో సమస్యలన్నీ తగ్గుతాయి. మీకు పురోభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. అకస్మాత్తుగా ధన ప్రవాహం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న డబ్బు మీ చేతికి వస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీరు వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు.
2.మకర రాశి
మీ రాశిలోని మూడవ ఇంట్లో శని, శుక్ర గ్రహాల కలయిక ఉండడం వలన మీ ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది. బంధువులతో సంతోషం పెరుగుతుది. మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. నిలిచిపోయిన ధనం మీ చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మంచి ఫలితాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. తోబుట్టువులు సంతోషంగా ఉంటారు.
3.వృషభ రాశి
వృషభ రాశి వారి 11వ స్థానంలో శని, శుక్ర గ్రహాల కలయిక చోటు చేసుకోనుంది. వృత్తి, వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి.
ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. విదేశీ పర్యటనలు మంచి పురోగతిని కలిగిస్తాయి. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. వివాహం, ప్రేమ జీవితం బాగుటుంది. కుటుంబ జీవితంలో అన్ని సమస్యలు తగ్గుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం