Shani Trayodashi: శని త్రయోదశి వ్రత సమయం, పూజా విధానం.. శని దేవుడిని ఇలా ఆరాధిస్తే మాత్రం దోషాలు పోతాయి-shani trayodashi pooja vidhanam pooja timings and do these to get rid of doshas and pray lord shiva and parvathi also ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Trayodashi: శని త్రయోదశి వ్రత సమయం, పూజా విధానం.. శని దేవుడిని ఇలా ఆరాధిస్తే మాత్రం దోషాలు పోతాయి

Shani Trayodashi: శని త్రయోదశి వ్రత సమయం, పూజా విధానం.. శని దేవుడిని ఇలా ఆరాధిస్తే మాత్రం దోషాలు పోతాయి

Peddinti Sravya HT Telugu

Shani Trayodashi: శని త్రయోదశి నాడు హిందువులు పరమేశ్వరుడిని, పార్వతి దేవిని ఆరాధిస్తారు. అలాగే శని దేవుడిని కూడా ఆరాధిస్తారు. త్రయోదశి వ్రతం పాటించడం వలన ఆందోళన, నిరాశ తొలగిపోతాయి. మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు.

Shani Trayodashi: శని త్రయోదశి శని త్రయోదశి శుభ సమయం, పూజా విధానం

శని త్రయోదశి నాడు శని భగవానుడుని శాంతింప చేయడానికి చాలా మంది హిందువులు పూజలు చేస్తూ ఉంటారు. శని భగవానుడిని శని త్రయోదశి నాడు ఆరాధించడం వలన అదృష్టం కలుగుతుంది. చెడు శక్తులు ఉంటే కూడా తొలగిపోతాయి. అందుకనే చాలా మంది ఆరాధించడం జరుగుతుంది. అలాగే శని త్రయోదశి నాడు ఉపవాసం ఉంటే కూడా మంచి జరుగుతుందని చాలా మంది హిందువులు భావించి అనుసరిస్తారు. దీనిని శని ప్రదోషం అంటారు. శనివారం త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశిని జరుపుతారు.

శని త్రయోదశి వ్రతం

శని త్రయోదశి నాడు హిందువులు పరమేశ్వరుడిని, పార్వతి దేవిని ఆరాధిస్తారు. అలాగే శని దేవుడిని కూడా ఆరాధిస్తారు. త్రయోదశి వ్రతం పాటించడం వలన ఆందోళన, నిరాశ తొలగిపోతాయి. మానసిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు. శ్రేయస్సు పెరుగుదలతో పాటుగా చేసే పనుల్లో విజయాన్ని కూడా శని త్రయోదశి నాడు పొందవచ్చు.

ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన కోరికలను కూడా శివుడు తీరుస్తారని చాలా మంది నమ్ముతారు. శని త్రయోదశి గురించి ఇంకా కొన్ని విషయాలను తెలుసుకుందాం.

శని త్రయోదశి పూజా సమయం

డిసెంబర్ 28 శనివారం తెల్లవారుజామున 2:08 గంటలకు త్రయోదశి వచ్చింది. డిసెంబర్ 29 ఆదివారం తెల్లవారుజామున 3:32 వరకు ఉంటుంది. ఈ లెక్కన డిసెంబర్ 28 శనివారం నాడు శని త్రయోదశి వచ్చింది.

శని త్రయోదశి పూజ పద్ధతి

  1. శని త్రయోదశి నాడు పూజ చేసుకోవాలనుకుంటే వీటిని కచ్చితంగా పాటించండి. ఇలా చేయడం వలన శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. సమస్యలు నుంచి గట్టెక్కచ్చు.

2. హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి శివుడు, పార్వతి దేవి, శనిదేవుని ఆరాధించడం మంచిది.

3. త్రయోదశి వ్రతం పాటిస్తే ఆందోళన, నిరాశ, మానసిక సమస్యలు తొలగిపోతాయి. సంతోషంగా ఉండవచ్చు.

4. శని త్రయోదశి నాడు బ్రహ్మ ముహూర్తంలో తల స్నానం చేయాలి. శనదేవుడుని ఆరాధించాలి. పూజ మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఉపవాస దీక్షని మొదలుపెట్టాలి.

5. శివుడు, పార్వతి దేవి విగ్రహాలని పెట్టి దీపారాధన చేయాలి. పండ్లు, పూలు తియ్యని పదార్థాలు సమర్పించాలి.

6. ఈరోజు పూజ చేసేటప్పుడు శివుడికి బిల్వ ఆకుల్ని సమర్పించాలి.

7. సాయంత్రం వరకు పండ్లు మాత్రమే తీసుకోవాలి. సాయంత్రం శివ పూజ చేసిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.