Shani Trayodashi: అనురాధ నక్షత్ర యుక్త శని త్రయోదశి చాలా విశేషమైనది - బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Shani Trayodashi: అనురాధ నక్షత్రానికి అధిపతి శని. శనికి సంబంధించిన నక్షత్రమవడం, శనివారానికి అధిపతి శని, త్రయోదశి తిథి శనికి ప్రీతికరమవడం లేదా శనికి జన్మతిథి అవడం చేత ఇలా మూడు అంశాలు 28 -12 -2024 ముడిపడి ఉండటం చేత ఈ శని త్రయోదశి చాలా ప్రత్యేకమైనదని, విశేషమైనదని ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, శనివారం రోజు త్రయోదశి తిథి కనుక ఉన్నట్లయితే, ఆ రోజుని శని త్రయోదశిగా చెప్పబడిందని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ప్రతి సంవత్సరంలో కొన్ని శని త్రయోదశి తిథులు రావడం సర్వసాధారణమని చిలకమర్తి తెలియజేశారు. అయితే, 2024 సంవత్సరం ఆఖరులో అనగా 20 డిసెంబరు 2024 మార్గశిర మాస అమావాస్యకుముందు శని త్రయోదశి అనురాధ నక్షత్రంలో ఏర్పడటం చాలా విశేషమైన యోగమని చిలకమర్తి తెలిపారు.
అనురాధ నక్షత్రానికి అధిపతి శని. శనికి సంబంధించిన నక్షత్రమవడం, శనివారానికి అధిపతి శని, త్రయోదశి తిథి శనికి ప్రీతికరమవడం లేదా శనికి జన్మతిథి అవడం చేత ఇలా మూడు అంశాలు 28-12-2024 ముడిపడి ఉండటం చేత ఈ శని త్రయోదశి చాలా ప్రత్యేకమైనదని, విశేషమైనదని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శని త్రయోదశి నాడు ఇలా చేయడం మంచిది
ప్రస్తుతం 2024 సంవత్సరంలో శని కుంభరాశిలో సంచరించడం చేత ఏలినాటి శని అయినటువంటి మకర, కుంభ, మీన రాశుల వారికి అలాగే అష్టమ శని సంచరిస్తున్నటువంటి కర్కాటక రాశి వారికి మరియు అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చికరాశి వారికి ఈ శని త్రయోదశి రోజు గనుక ఈ రాశుల వారు శనికి తైలాభిషేకం, నవగ్రహాలయంలో ప్రదక్షిణలు, పూజలు మరియు శనికి సంబంధించిన శాంతులు, జపాలు ఆచరించినట్లయితే అది చాలా విశేషమైన ఫలితం అందిస్తుందని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శని దోషాలు
జాతకంలో శని దోషాలు ఉన్నవారు, శని మహర్దశ, శని అంతర్దశ నడిచేటువంటి వారు కనుక అనురాధ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి ఈ శని త్రయోదశి రోజున శని గ్రహానికి పూజలు చేసినట్లయితే ఈతి బాధలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
ఈ రోజు ఆచరించాల్సిన ముఖ్య విషయాలు:
1.శని త్రయోదశి రోజు శరీరానికి నువ్వుల నూనె రాసుకొని తైలాభ్యంగన స్నానం ఆచరించాలి. ఇలా తైలాభ్యంగన స్నానం ఆచరించడం చేత నర ద్రుష్టి, నర ఘోష తొలగుతాయని చిలకమర్తి తెలిపారు.
2. ఈ రోజు నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణలు వంటి చేయడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మంచిది.
3. నువ్వులను దానమివ్వడం, నువ్వులతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి పంచిబెట్టడం, ఈ రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, ఈ రోజు దశరథ స్త్రోత్త శని స్త్రోత్తాన్ని పారాయణం చేయడం మంచిది.
4. నల ధమయంతుల కథ చదువుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
5. శని త్రయోదశి రోజు తూర్పుగోదావరిలో ఉన్న మందపల్లి క్షేత్రం, మహారాష్ట్రలో ఉన్న శని చిన్నాపూర్ క్షేత్రం, తమిళనాడులో తిరునల్లార్ వంటి శనికి సంబంధించిన ప్రముఖ క్షేత్రాలను దర్శించడం లేదా శని తైలాభిషేకం చేయడం శుభ ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
6. ఈ శని త్రయోదశి అనురాధ నక్షత్రంతో కూడి ఉండటం చేత చాలా ప్రత్యేకమైనదని, ఈ రోజు అభిషేకాలు వంటివి ఆచరించుకోవడం చేత శుభఫలితాలు పొందవచ్చని ప్రముఖ ఆధ్మాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.