Shani Transit: మార్చి తర్వాత శని మిమ్మల్ని క్షమించడు, ఈ రాశి వారు ఏ తప్పు చేయకుండా ఉంటే మంచిది
Shani Transit: జ్యోతిష శాస్త్రంలో శని రాశి మార్పు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. 2025 లో శని దేవుడు ఏ రాశులపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది శని రాశి మార్పు ఉంటుంది. శని సంచారం మొత్తం 12 రాశులపై ప్రభావితం చూపిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో శని రాశి మార్పు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. 2025 లో శని దేవుడు ఏ రాశులపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

1.మేష రాశి
మేష రాశి వారు 2025 మార్చి 29 తర్వాత జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి వారిపై శనిగ్రహం సడే సతి ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. అలాగే కెరియర్ లో కూడా హెచ్చుతగ్గులు ఉండొచ్చు.
శని కన్ను మీ రాశిపై ఉంటుంది. మార్చి 29 నుంచి మేషరాశిలో శనిగ్రహ ధైర్య సాహసాలు మొదలవుతాయి. రాబోయే రెండున్నర సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా సేవకులను, పేదలను, కూలీలని, బలహీనులని బాధ పెట్టకండి. ఏళ్ల తరబడి గుర్తుపెట్టుకునేలా శనీశ్వరుడు మిమ్మల్ని శిక్షిస్తాడు.
2. సింహ రాశి
ఈ సంవత్సరం మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడొద్దు. స్త్రీలను గౌరవించాలి. పొరపాటున కూడా ఎవరినీ మోసం చేయొద్దు. ఎలాంటి తప్పు కూడా చేయకుండా ఉండడం ముఖ్యం.
3. ధనస్సు రాశి
శని ధైయా జరుగుతుంది. శని మిమ్మల్ని కఠినంగా శిక్షించే పనిలో ఉన్నాడు. నియమాలు, క్రమశిక్షణని పాటించడం మంచిది. ఎవరికీ హాని చేయకండి. జంతువులు, పక్షులకు సేవ చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు. అలాగే మీకు మంచి ఫలితాలని కూడా ఇస్తాడు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటూ ఉండండి.
4. తులా రాశి
తులా రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే శని మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. శని అనుగ్రహం పొందడానికి ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వంటివి చేయకండి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవాలతో కూడిన వాటిని మాత్రమే ఇవ్వండి. లేదంటే శని దేవుడు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం