Shani Transit: వసంత పంచమి నాడు శని నక్షత్ర మార్పు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్.. అదృష్టం, ధనంతో పాటు ఫుల్లు సంతోషం-shani transit in purvabadra star 2nd padam these 3 zodiac signs will get luck wealth happiness and more see yours ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Transit: వసంత పంచమి నాడు శని నక్షత్ర మార్పు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్.. అదృష్టం, ధనంతో పాటు ఫుల్లు సంతోషం

Shani Transit: వసంత పంచమి నాడు శని నక్షత్ర మార్పు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్.. అదృష్టం, ధనంతో పాటు ఫుల్లు సంతోషం

Peddinti Sravya HT Telugu
Feb 01, 2025 07:00 AM IST

Shani Transit: శని పూర్వ భాద్రపద మొదట పాదం నుంచి రెండవ పాదమునకు సంచరించబోతున్నారు. పూర్వభద్రపద నక్షత్రానికి అధిపతి బృహస్పతి. అయితే, శని వసంత పంచమి నాడు పూర్వభద్రపద నక్షత్రంలో ఒక పాదం నుంచి ఇంకో పాదానికి సంచరించడంతో వసంత పంచమి నాడు ఈ 3 రాశుల వారికి అదృష్టం కలుగుతుంది.

Shani Transit: వసంత పంచమి నాడు శని నక్షత్ర మార్పు
Shani Transit: వసంత పంచమి నాడు శని నక్షత్ర మార్పు

తొమ్మిది గ్రహాలలో శని దేవుడు నీతిమంతుడు. శని రాశి మార్పు చాలా ముఖ్యమైనది. ఫిబ్రవరిలో శని గ్రహం మార్పు వలన చాలా రాశులపై ప్రభావం పడుతుంది. శని నక్షత్ర సంచారం ఫిబ్రవరి 2న వసంత పంచమి నాడు జరుగుతుంది.

సంబంధిత ఫోటోలు

ఈరోజు ఉదయం 8:01 గంటలకు శని పూర్వ భాద్రపద మొదట పాదం నుంచి రెండవ పాదమునకు సంచరించబోతున్నారు. పూర్వభద్రపద నక్షత్రానికి అధిపతి బృహస్పతి. అయితే, శని వసంత పంచమి నాడు పూర్వభద్రపద నక్షత్రంలో ఒక పాదం నుంచి ఇంకో పాదానికి సంచరించడంతో వసంత పంచమి నాడు ఈ రాశుల వారికి అదృష్టం కలుగుతుంది. ఈ మూడు రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

మకర రాశితో పాటు కర్కాటక, మిధున రాశి వారికి శని నక్షత్ర మార్పు వలన ధన లాభం తో పాటుగా, పనులు పూర్తవడం మొదలైన ఫలితాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

1.మకర రాశి

మకర రాశి వారికి శని నక్షత్ర సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలని పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. డబ్బుకు సంబంధించిన మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. సంతోషంగా ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపొచ్చు. మతపరమైన యాత్రలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. సడే సతి యొక్క అశుభ ప్రభావాలు కూడా తగ్గుతాయి.

2.కర్కాటక రాశి

వసంత పంచమి నుంచి శని దేవుడు కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. పూర్వభద్రపద నక్షత్రంలో శని సంచారం ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకి కూడా ఈ సమయం అనుకూలమైనది.

3.మిధున రాశి

శని నక్షత్ర సంచారం మిధున రాశి వారికి శుభప్రదంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం

Whats_app_banner