Shani Transit: హోలీ తర్వాత మీనంలో శని సంచారం, ఈ 3 రాశుల వారు నక్కతోక తొక్కినట్టే.. తిరుగే ఉండదు
Shani Transit: మీన రాశిలో శని సంచారం హోలీ తరవాత ఉంటుంది. శని మీనం సంచారం వల్ల ఏ రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి అనేది చూద్దాం.

హోలీ తరువాత, శని దాదాపు 30 సంవత్సరాల తరువాత కుంభ రాశి నుండి బయటకు వచ్చి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. శని మీన రాశి సంచారం 2025 మార్చి 29న ఉంటుంది. శని మీన రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు. మీనంలో శని రాక మేషం నుండి మీన రాశి వరకు మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది.
శని సంచారంతో కొన్ని రాశుల వారికి వృత్తి, ఉద్యోగాలతో వ్యాపారంలో పురోభివృద్ధి లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు లభిస్తాయి. శని మీనం సంచారం వల్ల ఏయే రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోండి.
1.మిథునం
శని సంచారం మిథున రాశి వారికి ఎంతో శుభదాయకం. శని మీ కర్మ గృహంలో సంచరిస్తాడు, శని ప్రభావం వల్ల ఉద్యోగ పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగార్థుల నిరీక్షణకు తెరపడుతుంది. వ్యాపారులకు లాభదాయక ఒప్పందాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
2. ధనుస్సు
ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శని మీ రాశిచక్రంలోని నాల్గవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. శని ప్రభావం వల్ల వ్యక్తిగత, వృత్తిగత జీవితం బాగుంటుంది. భూమి, భవనం, వాహన సుఖసంతోషాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి.
3. మకర రాశి
మకర రాశి వారికి శని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రాశిచక్రంలోని మూడవ ఇంట్లో శని సంచారం చేస్తాడు. శని సంచారం మీ ధన పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఆకస్మిక ధన లాభం పొందే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బును రికవరీ చేసుకోవచ్చు. వ్యాపారంలో విస్తరణ సాధ్యమవుతుంది. మీ తండ్రి నుండి మద్దతు లభిస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం