Shani Transit: కర్కాటక, వృశ్చిక రాశి వారికి శని నుంచి విముక్తి.. ప్రమోషన్, ఆదాయంలో పెరుగుదలతో పాటు ఎన్నో-shani transit effects karkataka vrischika rasi these rasis will get promotions and wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Transit: కర్కాటక, వృశ్చిక రాశి వారికి శని నుంచి విముక్తి.. ప్రమోషన్, ఆదాయంలో పెరుగుదలతో పాటు ఎన్నో

Shani Transit: కర్కాటక, వృశ్చిక రాశి వారికి శని నుంచి విముక్తి.. ప్రమోషన్, ఆదాయంలో పెరుగుదలతో పాటు ఎన్నో

Peddinti Sravya HT Telugu

Shani Transit: శని రాశి మార్పుతో పాటు కర్కాటక, వృశ్చిక రాశుల వారికి శని నుంచి విముక్తి కలుగుతుంది. ఈ రెండు రాశులపై శని సంచారం ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.

శని సంచారం

శని 29 మార్చి 2025న తన సొంత రాశి అయినటువంటి కుంభ రాశి నుండి బయటకు వచ్చి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. శని సంచారం వల్ల 12 రాశులపైనా ప్రభావం ఉంటుంది. శని రాశి మార్పుతో సింహ, ధనుస్సు రాశులపై శని దశ ప్రారంభమవుతుంది, అయితే కర్కాటక, వృశ్చిక రాశులపై శని దశ ముగుస్తుంది.

కర్కాటక, వృశ్చిక రాశుల వారికి శని దశ నుండి విముక్తి లభించడం వల్ల జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. శని సంచారం కర్కాటక, వృశ్చిక రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.

కర్కాటక రాశి

శని రాశి పరివర్తన వల్ల ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారులు లేదా సీనియర్ల సహకారం లభిస్తుంది, దీని వల్ల ప్రమోషన్, ఆదాయంలో పెరుగుదల లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి.

నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం ఏర్పడుతుంది. అయితే జూదం, గాంబ్లింగ్, లాటరీలలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు. అదృష్టం పెరుగుతుంది, దీనివల్ల పనుల్లో విజయం సాధిస్తారు. అవివాహితుల వివాహం ఖరారు కావచ్చు. విజయ శిఖరాలను అందుకుంటారు.

ప్రేమికులు కలుసుకునే అవకాశం ఉంది. కానీ శని ఐదవ పాదంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి ప్రమాదకరమైన పెట్టుబడులను నివారించండి. తలనొప్పి, కంటి నొప్పి రావచ్చు. కోపం పెరగవచ్చు.

శని బాధల నుంచి బయట పడడానికి ఈ పరిహారాలను పాటించవచ్చు

1. శనివారం రోజు శని స్తోత్రం పఠించండి.

2. శనివారం రోజు శనికి సంబంధించిన వస్తువులు, ఉదాహరణకు నల్లని బట్టలు, నల్లని నువ్వులు, ఇనుము మొదలైనవి దానం చేయాలి.

3. శనివారం రోజు సుందరకాండ పారాయణం లేదా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.

4. శనివారం రోజు శని ఆలయానికి వెళ్లి శని దర్శనం చేసుకోవాలి.

5. శనివారం రోజు రావి చెట్టు ముందు నువ్వుల నూనె దీపం వెలిగించాలి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Peddinti Sravya

eMail

సంబంధిత కథనం