నవగ్రహాలకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేకంగా శనీశ్వరుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. శని అనే పేరు చెప్తేనే అందరూ భయపడతారు. కర్మ ఫలాలని అందించే శని జూలై మాసంలో తిరోగమనం చెందుతాడు. ప్రస్తుతమైతే శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. శని తిరోగమనం వలన కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది.
శని తిరోగమనం జూలై 13 ఉదయం 7:24 గంటలకు శని మీన రాశిలో తిరోగమనం చెందుతాడు. ఆ తర్వాత నవంబర్ 28న ఉదయం 7:26 గంటలకు ప్రత్యక్షంగా మారతాడు. అంటే సుమారు 138 రోజులు తిరోగమనంలో ఉంటాడు. ఇది కొన్ని రాశుల వరకే అనేక లాభాలని తీసుకొస్తుంది. ఈ రాశులలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
మిధున రాశి వారికి శని తిరోగమనం వలన కలిసి వస్తుంది. ఏ పనిలోనైనా విజయాన్ని అందుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ పథకం నుంచి కూడా ప్రయోజనాన్ని అందుకుంటారు.
వృషభ రాశి వారికి శని తిరోగమనం వలన కొన్ని లాభాలు ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవడంతో పాటుగా వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఆర్థికంగా ప్రయోజనాలని పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.
కన్యా రాశి వారికి శని తిరోగమనం అనేక లాభాలని అందిస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.