శని దేవుడు మనం చేసే మంచి వాటికి మంచి ఫలితాలను, చెడ్డ వాటికి చెడు ఫలితాలను అందిస్తాడు. జూలై నెలలో శని తిరోగమనం చెందుతాడు. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది.
జూలై 13న శని తిరోగమనం చెందుతాడు. మీన రాశిలో శని తిరోగమనం 138 రోజులు పాటు ఉంటుంది. ఆ తర్వాత శని నవంబర్ 28న నేరుగా సంచరిస్తాడు. శని తిరోగమనం కొన్ని రాశుల వారికి సమస్యలను కలిగిస్తుంది. శని తిరోగమనం శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను రెండింటినీ ఇస్తుంది. 138 రోజులు పాటు శని తిరోగమనం కారణంగా ఈ రాశుల వారికి ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఈ సమయంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
మేష రాశి వారికి శని తిరోగమనం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ 138 రోజులు మేష రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఎవరి దగ్గర నుంచి అయినా రుణం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా శ్రద్ధతో ఏ పనినైనా పూర్తి చేసుకోవచ్చు. జాగ్రత్తలు ఉంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
కన్యా రాశి వారికి కూడా శని తిరోగమనం వలన చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు సహనంతో ఉండాలి. డబ్బుకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనవసరంగా ఆలోచించకుండా ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. ఏదైనా గొడవలు వంటివి వస్తే, మీ అంతట మీరే పరిష్కరించుకోవడం మంచిది.
మిథున రాశి వారికి శని తిరోగమనము వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు, కోపం కూడా ఎక్కువవుతుంది. సహనంతో ఉండాలి, లేదంటే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి వారికి జూలై నెలలో వచ్చే తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. ఫోకస్ పెట్టి పనులను పూర్తి చేసుకోవడం మంచిది. ఈ సమయంలో మీకు అలసటగా కూడా అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే తొందరపాటు మంచిది కాదు.
ధనుస్సు రాశి వారికి శని తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ 138 రోజులు ఈ రాశి వారు చిన్న చిన్న చాలెంజులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రతతో పనులు చేస్తే పూర్తవుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.