శని తిరోగమనంతో నవంబర్ 28 వరకు ఈ రాశులకు బోలెడు లాభాలు.. డబ్బు, నూతన పదోన్నతి అవకాశాలతో పాటు ఎన్నో!-shani retrograde brings many benefits till november 28th to gemini virgo scorpio and libra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శని తిరోగమనంతో నవంబర్ 28 వరకు ఈ రాశులకు బోలెడు లాభాలు.. డబ్బు, నూతన పదోన్నతి అవకాశాలతో పాటు ఎన్నో!

శని తిరోగమనంతో నవంబర్ 28 వరకు ఈ రాశులకు బోలెడు లాభాలు.. డబ్బు, నూతన పదోన్నతి అవకాశాలతో పాటు ఎన్నో!

Peddinti Sravya HT Telugu

జ్యోతిషశాస్త్రంలో తిరోగమన గ్రహాలను చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. గ్రహాల తిరోగమనం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. జూలై 13న శనిగ్రహం కదలిక మారబోతోంది. ఆ రోజున మీన రాశిలో శని తిరోగమనం చెందుతాడు. మరి శని తిరోగమనం వల్ల ఏయే రాశుల వారి తలరాతలు మారుతాయో తెలుసుకుందాం.

శని సంచారంలో మార్పు

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల తిరోగమనాన్ని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. గ్రహాల తిరోగమనం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. జూలై 13న శనిగ్రహం కదలిక మారబోతోంది. జూలై 13 నుంచి మీన రాశిలో శని తిరోగమనం చెందుతాడు. నవంబర్ 28 వరకు శని తిరోగమనంలో ఉంటాడు. దీని తరువాత శనిదేవుడు మళ్ళీ సంచరిస్తాడు.

జ్యోతిష శాస్త్రంలో శని దేవునికి ప్రత్యేక స్థానం ఉంది. శని దేవుడు శుభప్రదంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి జీవితం రాజులా మారుతుంది. శని తిరోగమనం నవంబర్ వరకు కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది. మరి శని తిరోగమనం వల్ల ఏయే రాశుల వారి తలరాతలు మారుతాయో తెలుసుకుందాం.

శని తిరోగమంతో నవంబర్ వరకు ఈ రాశులకు బోలెడు లాభాలు

1.మిథున రాశి:

శని తిరోగమనం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. పనులలో ఆటంకాలు తొలగుతాయి.

2.కన్య రాశి:

శని తిరోగమనం సంపద రాకకు కొత్త దారులు సుగమం చేస్తుంది. వస్తు సంపద పెరుగుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. అకస్మాత్తుగా, ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. సంబంధాల్లో పరస్పర అవగాహన, సమన్వయం మెరుగ్గా ఉంటాయి. మీరు మీ జీవితాన్ని సౌకర్యాలలో గడుపుతారు.

3.వృశ్చిక రాశి:

శని తిరోగమనం కారణంగా సంపద పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగార్థులకు నూతన పదోన్నతి అవకాశాలు లభిస్తాయి. మీరు పూర్తి శక్తి, ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

4.ధనుస్సు రాశి:

శని తిరోగమనం కారణంగా వృత్తిగత జీవితంలో శ్రమకు ప్రశంసలు లభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.