shani jayanti 2023 date: శని జయంతి మే 19న.. ఈ 5 రాశులకు అంతా శుభమే
shani jayanti 2023 date: శని జయంతి మే 19న రానుంది. ఈ 5 రాశులకు శని అనుగ్రహంతో అంతా శుభమే కలగనుంది.
శని జయంతి 5 రాశులకు శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శని దేవుడికి కర్మదాత, న్యాయ నిర్ణేత అని పేరుంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదని విశ్వసిస్తారు. అయితే శని జయంతి రోజున చేసే ప్రత్యేక పూజలు ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. శని జయంతి జ్యేష్టమాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది మే 19న శని జయంతి రానుంది. ఈ రోజున శనీశ్వరుడిని ఆరాధించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. శని జయంతి రోజున ఏయే రాశులకు అపారమైన అనుగ్రహం ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.
శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి రెండున్నరేళ్లకోసారి ప్రవేశిస్తాడు. దీనితో కొన్ని రాశులపై శని ప్రభావం ఉంటుంది. అంటే ప్రతి రెండున్నరేళ్లకోసారి విభిన్న రాశులపై శని అనుగ్రహం మారుతూ ఉంటుంది.
మకర రాశి వారికి ఇలా
శని మకర రాశికి అధిపతి. కాబట్టి శని అనుగ్రహం పొందిన రాశుల్లో ఇది ఒకటి. మకర రాశి జాతకులు బలమైన తర్కం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. శని అనుగ్రహంతో వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
వృషభ రాశి వారికి ఇలా..
వృషభ రాశికి శుక్రుడు, శని స్నేహపూర్వక గ్రహాలు. ఫలితంగా శని ఈ రాశి వారికి ఎల్లప్పుడూ సానుకూల ఫలితాలు అందిస్తారు. శుక్రుడు, శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశి వారికి విజయం, ఆరోగ్యం, కీర్తి, సంతోషం లభిస్తాయి.
తులా రాశి వారికి ఇలా..
శని అనుగ్రహం ఉండే రాశుల్లో తులా రాశి ఒకటి. తులా రాశి జాతకులు శని దేవుడి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. జాతకులు జంతువులు, నిరుపేదల పట్ల కరణ చూపడం వారికి అపారమైన విజయాన్ని, ధనాన్ని, కీర్తిని, సంతోషాన్ని ఇస్తుంది. ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి శని అనుగ్రహం లభిస్తుంది.
కర్కాటక రాశి వారికి ఇలా..
కర్కాటక రాశి జాతకులు శని అనుగ్రహం పొందుతారు. అందువల్ల తక్కువ ఇబ్బంది పడుతారు. 5, 9, 12వ ఇంటిలో శని ఉన్నప్పుడు కర్కాటక రాశి వారు కళ, రచన, జర్నలిజం వంటి సృజనాత్మక రంగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో అపారమైన విజయం, గౌరవం, సంపదను అనుభవిస్తారు. కర్కాటక రాశి వారు ఎల్లప్పుడు కుటుంబాన్ని, తల్లిదండ్రులను ఆదరిస్తారు. జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ లక్షణాలు వారికి అపారమైన విజయాన్ని, ఆనందాన్ని అందిస్తాయి.
కుంభ రాశి వారికి ఇలా..
ఈ రాశికి అధిపతి అయిన శని ఎల్లప్పుడు వీరిపై దయతో ఉంటాడు. కుంభ రాశి జాతకులు శనీశ్వరుడి అనుగ్రహం వల్ల సంపద, కీర్తి కలిగి ఉంటారు. కుంభ రాశి జాతకులు నిజాయతీగా, హుందాగా ఉంటారు. వివాహం సరైన మార్గంలో ఉంటే వారు సామాన్య కృషితో కూడా గొప్ప విజయం, కీర్తి, ప్రేమ, గౌరవాన్ని పొందుతారు.
సంబంధిత కథనం