Lord Shani Temples: 2025లో చూడాల్సిన శనీశ్వరుని ఆలయాలు.. ఈ ఆలయాలను దర్శించుకుంటే శని దోషాలు నుంచి బయటపడొచ్చు
Lord Shani Temples: చాలా మంది శని భగవానుని ఆరాధిస్తూ ఉంటారు. శని భగవానుడి ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి. శని భగవానుడి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రసిద్ధి చెందిన ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో శని ఒక గ్రహం. శనిని చూసి కష్టాలు కలిగిస్తాడని చాలా మంది భయపడతారు. శని పాపములకు తగిన శిక్ష వేస్తారని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. గ్రహాలలో నీతివంతుడు శని. మంచి చెడులు అన్నిటిని కూడా వర్గీకరించి రెట్టింపు తిరిగి ఇస్తాడు. కర్మ భగవానుడు శని భగవానుడు దర్శనమిస్తే అందరూ కూడా భయపడతారు.
శని ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి మారడానికి రెండున్నర ఏళ్ళు పడుతుంది. తొమ్మిది గ్రహాల్లో శని గ్రహం నెమ్మదిగా కదిలే గ్రాహం. 30 ఏళ్ల తర్వాత శని సొంత రాశి అయినటువంటి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే చాలా మంది శని భగవానుని ఆరాధిస్తూ ఉంటారు.
శని భగవానుడి ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి. శని భగవానుడి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రసిద్ధి చెందిన ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తిరునల్లార్ శనీశ్వర ఆలయం
చాలామంది ఈ ఆలయం గురించి విని ఉంటారు. శనీశ్వరుని ఆలయాల్లో పురాతనమైన ఆలయం ఇదే. పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన కారేకల్ జిల్లాలో తిరునల్లారు పట్నంలో ఈ ఆలయం ఉంది. మూడువేల ఏళ్ళ క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. నలమహారాజు శని ప్రభావం నుంచి ఇక్కడే విముక్తి పొందారు. ఇక్కడ స్వామి వారు దర్భారణ్యేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడకు దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు దర్బలను ముడి వేస్తారు. ఈ విధంగా చేస్తే శని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
ప్రమిదల్లో దీపాలు పెట్టి స్వామి వారి ముందు ఉంచుతారు. గర్భగుడిలో దర్భారణ్యేశ్వరుని పేరుతో పూజలు అందుకుంటున్న శివలింగం ఉంటుంది. శివలింగానికి ఎడమవైపు అమ్మవారి కోవెలకు వెళ్తూ ఉంటే గర్భగుడికి ఆనుకుని ఉన్న చిన్న మందిరంలో శనీశ్వరుని మందిరం ఉంటుంది. ఈయన ద్వారపాలకునిగా ఉంటున్నట్లు శనీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ భక్తులు దానాలు ఇస్తారు. అలాగే తైలాభిషేకాలు చేస్తారు. ఇక్కడ నల్ల తీర్థం ఉంది. ఇక్కడ స్నానం చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.
తిరుకొల్లికాడు శ్రీ అగ్నేశ్వర దేవాలయం
తిరువారూర్ అగ్నేశ్వరుడుని, శని భగవానుడిని ఇక్కడికి వచ్చి చాలా మంది ఆరాధిస్తారు. శని గ్రహం ప్రతికూలత వలన బాధపడే వాళ్ళు ఉపశమనం కోసం ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి అభిషేకాలు చేస్తారు. అలాగే వస్త్రాలని కూడా సమర్పిస్తారు. ఇక్కడ మహాశివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుతారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు.
శని శింగనాపూర్, మహారాష్ట్ర
చాలా మంది శని శింగనాపూర్ ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఈ ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ గ్రామం మధ్యలో ఆలయ వేదికని సోనై అని అంటారు. చాలామంది పర్యటకులు, భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. 350 సంవత్సరాల కంటే ఈ ఆలయం పూర్తనమైనది. స్థానిక పురాణాల ప్రకారం ఇక్కడ శనీశ్వరుడు స్వయంభుగా వెలసినట్లు నమ్ముతారు. ఇక్కడ శనీశ్వరుడి ఆలయానికి గోడలు పైకప్పు ఏమీ ఉండవు. స్వయంభుగా వెలసిన ఐదు అడుగుల ఎత్తైన నల్ల రాయి ఉంటుంది. అలాగే ఈ ఊర్లో ఇళ్లకు కూడా తలుపులు తాళాలు ఉండవు
శనీశ్వర ఆలయం, కుచనూర్, తమిళ్ నాడు
ప్రసిద్ధి చెందిన శని ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే శని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. శనీశ్వరుని ఆలయం కుచనూర్ శక్తివంతమైన ఆలయాల్లో ఒకటి. ఇక్కడ కూడా శనీశ్వరుడిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేయడం వలన జాతకంలో శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు. ఈ ఆలయం అందమైన ప్రకృతి మధ్య ఉంది. చూడడానికి చాలా బావుంటుంది.
మందపల్లి శనీశ్వరుని ఆలయం, ఆంధ్రప్రదేశ్
ఈ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. మందపల్లిలోని ఈ ఆలయానికి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రత్యేకించి శనిదేవుని ఆరాధించి అభిషేకాలు జరుపుతారు. ఇక్కడికి వెళ్తే అదృష్టం కలుగుతుందని ప్రతికూల ప్రభావం తొలగిపోతుందని నమ్ముతారు.
శనీశ్వరుని ఆలయం, పావగడ
పావగడలో ఉన్న శనీశ్వరుని ఆలయం కూడా ప్రసిద్ధిగాంచింది. శని ప్రతికూల ప్రభావం తొలగిపోయి మంచి జరగడానికి చాలామంది ఆలయానికి వస్తూ ఉంటారు. శనీశ్వరుడికి పూజలు చేస్తారు.
శనిదాం టెంపుల్
న్యూఢిల్లీలో ఉన్న ఈ ఆలయం కూడా ప్రసిద్ధి చెందినదే. ఇక్కడకు కూడా చాలా మంది భక్తులు శని దోషాల నుంచి బయట పడడానికి వస్తూ ఉంటారు.
శనీశ్వర ఆలయం, మధ్యప్రదేశ్
మన దేశంలో ఉన్న పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. చాలా కాలం క్రితం పడిపోయిన ఉల్క నుంచి శనీశ్వరుని విగ్రహం వచ్చిందని నమ్ముతారు. భక్తులకు కలిగే దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎప్పుడు భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది.
శ్రీ విద్యా సరస్వతీ శనేశ్వర ఆలయం, వరంగల్
సిద్దిపేట జిల్లా వరంగల్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. శ్రీ విద్యా సరస్వతి ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ సరస్వతి దేవి విగ్రహంతో పాటుగా శనీశ్వరుడు విగ్రహం ఉంది. ఇక్కడే గణపతి ఆలయం, శివుని ఆలయాలు కూడా ఉన్నాయి. పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి దూరం నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ శనీశ్వరునికి కూడా పూజలు చేయడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం