Samsaptaka yogam: వేద జ్యోతిషశాస్త్రంలో శని రాశి మార్పు చాలా కీలకమైనదిగా పరిగణిస్తారు. ఇతర గ్రహాలతో శని కలయిక ద్వారా ఏర్పడిన శుభ యోగం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. దీని శుభ, అశుభ ప్రభావాలు మొత్తం 12 రాశులపై పడతాయని నమ్ముతారు.
జూలై నెలలో సూర్యుడు, శని కలిసి షడష్టక యోగాన్ని ఇచ్చారు. జ్యోతిష్య శాస్త్రంలో ఇది అశుభమైనదిగా చెప్తారు. జాతకంలో ఈ రెండు గ్రహాలు ఆరవ, ఎనిమిదవ ఇళ్ళలో ఉండటం వల్ల శక్తివంతమైన షడష్టక యోగాన్ని సృష్టిస్తున్నారు. వచ్చే ఆగస్టు నెలలో సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగష్టు 16 న సూర్యుని సంచారము తరువాత ఏడవ ఇంటిలో సూర్యుడు, శని గ్రహాలు రెండూ ఒకదానికొకటి చూపుతాయి. దీని వల్ల సంసప్తక యోగం ఏర్పడబోతుంది.
జ్యోతిషశాస్త్రంలో సంసప్తక యోగాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. నెల రోజుల పాటి ఈ యోగం ప్రభావం ఉంటుంది. అయితే శుభ, అశుభ గ్రహాల కలయిక వల్ల ఇది జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని కూడా కలిగిస్తుంది. ఆగస్ట్‌లో ఏ రాశుల వారికి సూర్య-శని ఈ స్థానం వల్ల కష్టాలు పెరుగుతాయో తెలుసుకుందాం.
సూర్యుడు, శని గ్రహాలు ముఖాముఖిగా రావడం వల్ల మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో శత్రువులు చురుకుగా ఉంటారు. మీరు పనిలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు. కష్టపడి పని చేసినప్పటికీ మీరు మంచి ఫలితాలను పొందలేరు. ఆఫీసులో ఎవరైనా మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. డబ్బుకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఈ కాలంలో ఎవరికీ పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వకండి. ఆర్థికంగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
సూర్యుడు, శని ఇవ్వబోతున్న సంసప్తక యోగం మకరరాశి వారికి సమస్యలకు కారణం కావచ్చు. ఈ కాలంలో ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. కోర్టు కేసులలో వివాదాలు పెరుగుతాయి. మనస్సు కలత చెందుతూనే ఉంటుంది. సంబంధాలలో వివాదాలు పెరగవచ్చు. మీ జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. వృత్తి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. ఉద్యోగస్తులు తమ పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.
సంసప్తక యోగం మీన రాశి వారికి సమస్యలను పెంచుతుంది. ఈ సమయంలో ఆస్తికి సంబంధించిన వివాదాలు పెరిగే అవకాశం ఉంది. అయితే న్యాయపరమైన విషయాల్లో దూరం పాటించండి. అధిక ఖర్చుల వల్ల మనస్సు కలత చెందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. సంబంధాలలో అపార్థాలు పెరగవచ్చు. శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. ప్రత్యర్థులు హాని కలిగించవచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.