కుజుడు ధైర్యం, పరాక్రమానికి చిహ్నం. సమయానుసారం కుజుడు రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. జూన్ 7న కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. సింహ రాశిలో జూలై 28 వరకు సంచరిస్తాడు.
మిధున రాశి వారికి షడాష్టక రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఎన్నో విజయాలని కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. పెద్ద బాధ్యతల్ని స్వీకరిస్తారు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృశ్చిక రాశి వారికి కుజుడు, శని కలయికతో ఏర్పడిన ఈ రాజయోగం ప్రయోజనకరంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. పెద్ద పరీక్షలను కూడా క్లియర్ చేస్తారు. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగులను లభించే అవకాశం ఉంది. ఉద్యోగాలు మారేవారికి కూడా కలిసి వస్తుంది.
మీన రాశి వారికి ఈ యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ సంతోషంగా ఉంటారు. మీ భాగస్వామికి మీపై ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలో కూడా సక్సెస్ అందుకుంటారు. ప్రభుత్వ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది మంచి సమయం. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలతో పాటు ప్రయాణాలు చేస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.