సెప్టెంబర్ 1, నేటి రాశి ఫలాలు-కొత్త స్నేహాలు కుదురుతాయి, ఆదాయ మార్గాలు కనిపిస్తాయి
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ01.09.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 01.09.2024
వారం: ఆదివారం, తిథి: చతుర్దశి,
నక్షత్రం: ఆశ్లేష, మాసం: శ్రావణము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
ముఖ్యమైన విషయాలను, చర్చలను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. సహోద్యోగులతో సఖ్యత ఏర్పడుతుంది. శుభకార్యాలు, శుభకార్య సంబంధిత ప్రసంగాలు ఫలవంతంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. యాంత్రికంగా పనులు పూర్తి చేస్తారు. శ్వేతార్క గణపతిని పూజించండి.
వృషభం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధు, మిత్రుల సలహాలు తీసుకుంటారు. మనోనిబ్బరంతో ముందడుగు వేసి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. రవాణా శాఖలో ఉన్నవారికి బాగుంటుంది. వ్యాపార నిమిత్తం కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. వినాయక దేవాలయాన్ని సందర్శించండి.
మిథునం
కళ, సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగి వుంటారు. సినిమాలు, ఎలక్ట్రానిక్ మీడియా పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది. ఇంట్లో వారికి నచ్చకపోయినా కొత్త కోర్సులు నేర్చుకోవాలని భావిస్తారు. కొంతమంది వల్ల నిరాశ ఎదురవుతుంది, ఆశించిన స్థాయి వారి అండదండలు లభించకపోవచ్చు. పూజల్లో నాగబంధం కుంకుమ ఉపయోగించండి. ప్రేమ వ్యవహారాల పట్ల ఆకర్షణ ఉంటుంది.
కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి కొత్త మాధ్యమాల ద్వారా ధనం సంపాదించాలన్న ఆలోచనలు కలిసివస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోకండి. ఓర్పు వహించండి. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయండి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. నూతన ఒప్పందాలు పరిష్కారం చేసుకుంటారు. నిందారోపణలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
సింహం
ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చిన్న నాటి స్నేహితుల వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఉపయుక్తమైన సమాచారం తెలుసుకుంటారు. పూజలలో ఆరావళి కుంకుమ ఉపయోగించండి. అష్టమూలికా తైలం, లక్ష్మీతామర వత్తులతో ప్రతిరోజూ దీపారాధన శుభప్రదం.
కన్య
భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వివాహాది ఉభ కార్యాలు సానుకూలవడతాయి. కీలకమని భావించిన విషయాలలో తొందరపాటు తగదు. జాగ్రత్త వహించండి. జిల్లేడు వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలు తొలగిపోతాయి. కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ పని చేస్తారు.
తుల
మంచి విషయాల గురించి సమయం ఉపయోగించుకుంటారు. కాలక్షేపం చేసేవారు మీకు నచ్చరు. స్నేహితులు, సన్నిహితులు అయినా ఇది మంచిది పద్ధతి కాదని నిర్మొహమాటంగా వారికి సలహాలిస్తారు. నూతన క్రయ, విక్రయాలు ప్రారంభిస్తారు. ఫుడ్, కిరాణా వ్యాపారాలు బాగుంటాయి. చేతికి కుబేర కంకణం ధరించండి. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. కొద్దిపాటి పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జిస్తారు. రహస్య మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి.
వృశ్చికం
స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందిస్తారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. కీలకమైన వ్యక్తుల గురించి అసలు విషయాలు తెలుసుకుంటారు. ప్రేమ వివాహాలు, వ్యవహారాలు విఫలమవుతాయి. బ్యాంకు రుణాల గురించి అధికంగా ఆలోచిస్తారు.
ధనుస్సు
ఆశించిన శుభవార్తలు వింటారు. స్వల్ప ప్రయోజనాల కోసం పెద్ద స్థాయి పరిచయాలను ఉపయోగిస్తారు. మీ వారి కోసం కొన్ని పనులు చెయ్యక తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అష్టమూలికా తైలం, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. పెళ్లి సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొంతమంది చేసే ప్రచారాలు మీకు నచ్చవు. వాస్తవాలకు అతీతంగా ఉన్నవాటిని మీరు ఆమోదించరు.
మకరం
మొండి మనుషులను సైతం మార్చగలుగుతారు. కార్యాలయంలో మార్పులు ఏర్పడతాయి. వాటిని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మరికాస్త వ్యవధి పడుతుందని గ్రహిస్తారు. రాజకీయ స్నేహాలు బలపడతాయి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. రెన్యువల్స్ కోసం దరఖాస్తులు దాఖలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.
కుంభం
మనవాళ్లే కదా అని చూసీ చూడకుండా వదిలేసినా కొన్ని కొత్త సమస్యలు, చికాకులు వస్తాయి. నూతన వ్యాపారాల వ్యవహారాలు కుదురుతాయి. పాత వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. రొటేషన్స్ లాభాలు ఊరట కలిగిస్తాయి. క్రయవిక్రయాలు బాగుంటాయి. ఒక స్థలం అమ్మకానికి పెడతారు, మంచి ధర కోసం ఎదురు చూస్తారు.
మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వాళ్ళు జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎన్నో రకాల ప్రయోజనాలు ఆశించి కొంతమంది వ్యక్తులను ఆశ్రయిస్తారు. అవి ఫలిస్తాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశంలో సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదృష్టి తొలగిపోతుంది. అన్ని రకాల వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా ప్రోత్సాహం లభిస్తుంది. డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి.