మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలను గుర్తుపెట్టుకుంటాం, కానీ కొన్ని కలలు మర్చిపోతూ ఉంటాం. ఒక్కోసారి భయంకరమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. మన మానసిక స్థితికి ప్రతిరూపం కళ అని స్వప్న శాస్త్రం చెప్తోంది.
కలల ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ జంతువులు పదే పదే కనబడితే అదృష్టానికి సంకేతంగా భావించాలి. మరి ఎలాంటి జంతువులు కలలో కనబడితే మంచిది? వేటివల్ల అదృష్టం వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ప్రకారం కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను తెలుపుతాయి. మనకు కలల్లో జంతువులు కూడా కనబడతాయి. నిజానికి జంతువులు కలలో కనబడితే శుభప్రదంగా భావించాలి. మరి కలలో ఎటువంటి జంతువులు కనబడితే మంచిది అనేది చూద్దాం.
కలలో ఏనుగు కనబడితే మంచి జరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. సంపద, శ్రేయస్సును పొందవచ్చు. సుఖసంతోషాలు కలుగుతాయి. ఎవరికైతే కలలో ఏనుగు కనబడుతుందో వారికి మంచి రోజులు మొదలవుతాయి.
కలలో ఆవు కనబడితే కూడా మంచి జరుగుతుంది. అదృష్టంగా భావించాలి. కలలో ఆవు–దూడలను చూడడం శుభ సంకేతం. ఎవరి కలలో అయితే ఆవు దూడ కనబడతాయో వారికి భగవంతుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.
కలలో నల్ల పాము కనబడితే ఎంతో మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కీర్తి పెరుగుతుందని ఈ కల వెనుక అర్థం. కోరికలు కూడా నెరవేరుతాయి.
కలలో కుందేలు కనబడితే కూడా మంచి జరుగుతుంది. జీవితంలో ప్రేమ పెరుగుతుందని ఇది సూచిస్తుంది. ప్రతి దాంట్లో కూడా విజయాన్ని అందుకోవచ్చు.
కలలో గుడ్లగూబ తరచుగా కనబడుతున్నట్లయితే సంపద పెరుగుతుందని దానికి అర్థం. గుడ్లగూబ కలలో కనబడితే లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయట.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.