సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం ఎప్పుడు, ఈసారి బ్లడ్ మూన్ కనిపిస్తుందని తెలుసా? సూతక కాలంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో!-second lunar eclipse in this year this time it is check time and full details ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం ఎప్పుడు, ఈసారి బ్లడ్ మూన్ కనిపిస్తుందని తెలుసా? సూతక కాలంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో!

సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం ఎప్పుడు, ఈసారి బ్లడ్ మూన్ కనిపిస్తుందని తెలుసా? సూతక కాలంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో!

Peddinti Sravya HT Telugu

చంద్ర గ్రహణానికి జ్యోతిష్య, మత మరియు శాస్త్రీయ ప్రాముఖ్యత చాలా ఉంది. ధార్మిక కోణంలో చూస్తే చంద్రగ్రహణానికి కారణం రాహు-కేతువుగా భావిస్తారు. సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం ఎప్పుడు, సూతక కాలంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి.

సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం

చంద్రగ్రహణానికి జ్యోతిష్య, మత, శాస్త్రీయ ప్రాముఖ్యత చాలా ఉంది. ధార్మిక కోణంలో చూస్తే చంద్రగ్రహణానికి కారణం రాహు-కేతువుగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కేతువు కారణంగా ఏర్పడబోతోంది. నీడ గ్రహాలైన రాహు, కేతువులను పాముల్లా భావిస్తారు, వీటి కాటు గ్రహణాలకు కారణమవుతుంది.

అదే సమయంలో రాహు, కేతువులు చంద్రుడిని మింగడానికి ప్రయత్నించినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందని కొందరు నమ్ముతారు. శాస్త్రీయంగా, చంద్రుడు, భూమి మరియు సూర్యుడు ఒకే సరళరేఖలో వచ్చినప్పుడు, ఈ సమయంలో సూర్యుడి కాంతి భూమిపై పడుతుంది, కానీ చంద్రుడిపై పడదు. దీనిని చంద్రగ్రహణం అంటారు.

సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు?

సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుగుతుంది. భాద్రపద మాసంలోని పౌర్ణమి 2025 సెప్టెంబరు 7న వస్తుంది. ఇదే రోజు సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం ఏర్పడుతోంది.

గ్రహణం సెప్టెంబర్ 7న ఏర్పడి సెప్టెంబర్ 8 అర్ధరాత్రి వరకు ఉంటుంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 9:58 గంటలకు ప్రారంభమై 01:26 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అవుతుంది.

ఆకాశంలో బ్లడ్ మూన్

ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలోనే వస్తాడు. చంద్రుడు పూర్తిగా భూమి నీడలో ఉన్నప్పుడు, దాని రంగు లేత ఎరుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు.

ఈ ఏడాదిలో రెండో చంద్ర గ్రహణం మన దేశంలో కనపడుతుంది. ఆసియా, యూరప్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రంలో కూడా కనిపిస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది, దీని కారణంగా సూతక కాలం కూడా చెల్లుబాటు అవుతుంది. గ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం