Lunar eclipse 2024: ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఎప్పుడు? గ్రహణానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు
Lunar eclipse 2024: ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇది భారత్ లో కనిపిస్తుందా? ఈ గ్రహణానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం ఇస్తున్నాం.

Lunar eclipse 2024: వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అన్ని గ్రహాలలో సూర్యుడు, చంద్రుడు గ్రహణం ఏర్పడే రెండు గ్రహాలు. గ్రహణ కాలానికి సంబంధించి గ్రంధాలలో కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో రెండు చంద్ర గ్రహణాలు సంభవించనున్నాయి. వాటిలో ఒకటి మార్చి 25, 2024న ఏర్పడింది. మరొకటి 18 సెప్టెంబర్ 2024న ఏర్పడబోతుంది.
చంద్రగ్రహణ సమయం ఎప్పుడు?
2024 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 బుధవారం నాడు జరుగుతుంది. ఇది ఉదయం 06:11 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 10:17 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం భాద్రపద మాసం శుక్ల పక్ష పౌర్ణమి నాడు వస్తుంది.
భారత్ లో కనిపిస్తుందా?
మొదటి సారి ఏర్పడిన చంద్రగ్రహణం భారత్ లో కనిపించలేదు. ఈసారి ఏర్పడే గ్రహణం దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ ఐరోపాలో పెనుంబ్రల్ చంద్రగ్రహణం అవుతుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. పెనుంబ్ర దశ ప్రారంభ దశలో ఉత్తర, వాయువ్య భారత నగరాల్లో చంద్రగ్రహణం కనిపించే అవకాశం ఉంది. భారతదేశంలోఇది సాధారణ గ్రహణంగా పరిగణించరు. అందుకే దీన్ని సాధారణ గ్రహణంగా కాకుండా పాక్షిక పెనుంబ్రల్ గ్రహణంగా పరిగణిస్తారు.
చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది?
సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునికి చేరుకోలేనప్పుడు ఈ దృగ్విషయం సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో భూమి నీడ చంద్రునిపై పడుతుంది. ఈ దృగ్విషయాన్ని చంద్రగ్రహణం అంటారు.
సూతక్ కాలం ఉంటుందా?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ కాలానికి కూడా ప్రాముఖ్యత ఉంది. సూతక్ కాలం చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు లేదా ఇది పాక్షిక చంద్రగ్రహణంగా చెబుతున్నారు. అందువల్ల సూతక్ కాలం భారతదేశంలో చెల్లదు.
చంద్రగ్రహణానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు
సెప్టెంబర్ 2024లో సంభవించే చంద్రగ్రహణం పాక్షిక గ్రహణం అవుతుంది. ఇది భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుగుతుంది. పూర్వ భాద్రపద నక్షత్రం ప్రభావంతో భాద్రపదలో మీన రాశిలో ఈ సంఘటన జరుగుతోంది. ఈ గ్రహణం ఆర్థిక పురోగతికి కూడా దారితీస్తుంది. ప్రభుత్వ సంస్థల్లో కూడా పురోగతి కనిపిస్తుంది.
పాక్షిక చంద్రగ్రహణం సంభవించినప్పుడు రాగి, బంగారం, మొక్కజొన్న, వెండి, నూనెలు, పప్పులు వంటి వాటివికి ధరలు, డిమాండ్ పెరుగుతాయి. జీర్ణ సంబంధిత రుగ్మతలు వచ్చే అవకాశం ఉందని చెప్తారు.
గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గ్రహణ కాలంలో భగవంతుడిని స్మరిస్తూ మంత్రాలను జపించాలి. చంద్ర బీజ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో రాహు, కేతువుల ప్రభావం తీవ్రమవుతుందని చెప్తారు. అందుకే ఈ రెండు గ్రహాలు సానటించేందుకు రెండు గ్రహాల మంత్రాలను పఠించవచ్చు.
ఎవరైనా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే గ్రహణ సమయంలో శివునికి చెందిన మహా మృత్యుంజయ మంత్రం జపించాలి. ఈ సమయంలో హనుమంతుడిని పూజించడం కూడా శ్రేయస్కరంగా భావిస్తారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత నల్ల నువ్వులు, ఆవాలు, గోధుమలు, పంచదార, తెల్లని వస్త్రాలు దానం చేయవచ్చు. గ్రహణం ముగిసిన తర్వాత గంగాజలంతో ఇంటిని శుద్ది చేసుకోవాలి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.