Scorpio Weekly Horoscope : వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఉద్యోగాలు మారుతారు, వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు-scorpio weekly horoscope august 18 to august 24 in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Scorpio Weekly Horoscope : వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఉద్యోగాలు మారుతారు, వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు

Scorpio Weekly Horoscope : వృశ్చిక రాశి వారు ఈ వారంలో ఉద్యోగాలు మారుతారు, వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు

Galeti Rajendra HT Telugu
Aug 18, 2024 06:30 AM IST

Vrishchika Rasi Weekly Horoscope: ఇది ఈ రాశిచక్రం 8వ రాశి. పుట్టినప్పుడు చంద్రుడు వృశ్చికంలో సంచరిస్తున్న జాతకులు, వారి రాశిని వృశ్చిక రాశిగా పరిగణిస్తారు.

వృశ్చిక రాశి వార ఫలాలు
వృశ్చిక రాశి వార ఫలాలు (Pixabay)

Scorpio Weekly Horoscope August 18 to August 24: వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి జీవితంలో చిన్న చిన్న సవాళ్లు ఎదురైనా ప్రతి సమస్యను తెలివిగా పరిష్కరిస్తారు. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

ప్రేమ

వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రారంభంలో మీ భావోద్వేగాలను మీ ప్రియుడితో పంచుకోండి. మీ భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపండి. గతం గురించి ఎక్కువగా చర్చించవద్దు. ఇది జీవిత భాగస్వాములను కాస్త ఇబ్బంది పెడుతుంది.

మాజీ లవర్‌తో పాత సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది జీవితంలో మాజీ ప్రేమికుడు తిరిగి మీ జీవితంలోకి రావడానికి కూడా దారితీస్తుంది. కాబట్టి వివాహిత స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్య ఉండదు. ఈ వారం, కొంతమంది ప్రేమికులకి తల్లిదండ్రుల మద్దతు కూడా లభిస్తుంది. పెళ్లి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు.

కెరీర్

వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రారంభంలో ఉద్యోగాలు మారాలని నిర్ణయించుకోవచ్చు. జాబ్ పోర్టల్లో మీ ప్రొఫై‌ల్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వారం ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వృత్తి జీవితంలో కొంచెం ఓపిక పాటించండి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగించండి.

విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఆ పరీక్షలో విజయం సాధిస్తారు. బంగారం, ఫ్యాషన్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారస్తులకు ఈ వారం మంచి రాబడులు లభిస్తాయి.

ఆర్థిక

వృశ్చిక రాశి వారికి ఈ వారంఅత్యవసర వైద్య పరిస్థితి కారణంగా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది న్యాయ పరమైన వివాదాల కారణంగా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. సన్నిహితులు కూడా ఆర్థిక సహాయం కోరవచ్చు. మీరు ఈ వారం ప్రారంభంలో వాహనం కొనుగోలు చేయవచ్చు.

ఆరోగ్యం

ఈ వారం వృశ్చిక రాశి వారు మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్త వహించండి. రోజూ యోగా, వ్యాయామం చేయాలి. మీ ఆహారంలో చక్కెర , ఫాస్ట్‌ఫుడ్‌ను నివారించండి. బదులుగా, కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినండి. కొంతమంది వృశ్చిక రాశి జాతకులకి కీళ్ళు లేదా మోకాళ్ళలో నొప్పి ఇబ్బంది పెట్టొచ్చు. కంటి ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్ లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించవచ్చు. ఇబ్బందిగా అనిపిస్తే వైద్యులను సంప్రదించండి.