Lucky zodiac signs: హోలీ, చంద్రగ్రహణంతో ఈ రాశుల వారికి శుభ ఘడియలు మొదలవుతాయి
Lucky zodiac signs: హోలీ నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో పాటు శని ఉదయించబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి శుభ ఘడియలు ఆరంభం కాబోతున్నాయి.
Lucky zodiac signs: నవగ్రహాలలో శని గ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. కర్మల అనుసారం ఫలితాలను ఇస్తాడు. అందుకే శని అనుగ్రహం ఉంటే సంపద లభిస్తుంది. డబ్బుకి లోటు ఉండదు. ప్రస్తుతం అస్తంగత్వ దశలో ఉన్న శని హోలీ సమయానికి ఉదయించబోతున్నాడు. శని కదలికలో మార్పుకి అధిక ప్రాధాన్యత ఉంటుంది.
ఈ ఏడాది మార్చి 25న హోలీ పండుగ జరుపుకోనున్నారు. అదే రోజు తొలి చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. దీన్నే ఫాల్గుణ పౌర్ణమి అని కూడా అంటారు. మన దేశంలో చంద్రగ్రహణం కనిపించదు. అందువల్ల సూతక్ కాలం కూడా పరిగణలోకి తీసుకోరు. కానీ చంద్రగ్రహణ ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద ఉంటుంది.
హోలీ, చంద్రగ్రహణం ఒకే సారి రావడం వల్ల ఈ ఏడాది రంగుల పండుగ కొన్ని రాశుల వారికి శుభదాయకంగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా శని కుంభ రాశిలో ఉదయించబోతున్నాడు. సంవత్సరం పొడవునా ఇదే స్థితిలో ఉంటాడు. ఇటువంటి సందర్భంలో హోలీ నాడు శని గ్రహం చంద్రగ్రహణం కారణంగా ఏ ఏ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుందో తెలుసుకుందాం.
తులా రాశి
చంద్ర గ్రహణం, శని ఉదయించడం వల్ల తులా రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుఖశాంతులు, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. శని శుభ ప్రభావం కారణంగా వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. శని అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తొలగి ఆదాయం పెరుగుతుంది.
ధనుస్సు రాశి
హోలీ, చంద్రగ్రహణం, శని ఉదయించడం వంటి అనేక పరిణామాల ప్రభావం ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగుల మద్దతుతో మీరు వృత్తిలో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కెరీర్ లో మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగేందుకు మీకు కొత్త మార్గాలు కనిపిస్తాయి.
మకర రాశి
మకర రాశికి శని అధిపతి. అందువల్ల ఈ రాశి వారి మీద శని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశి జాతకులు శని ఉదయించడం వల్ల భారీ ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మెరుగైన సంబంధాలు ఏర్పడతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు.
వృషభ రాశి
హోలీ, చంద్రగ్రహణం ఒకే రోజు రావడం వల్ల వృషభ రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. స్నేహితుడి సహాయంతో జీవితంలో ఎదురయ్యే కష్టాలు అధిగమిస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. ఉన్నత పదవులు దక్కుతాయి. కార్యాలయంలో మీరు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి.