Saturn retrograde: శని తిరోగమనం.. రాబోయే కొన్ని నెలలు వీరికి ఆర్థిక సంక్షోభం, కోర్టు కేసుల్లో అపజయం-saturn retrograde in kumbha rashi some zodiac signs struggle financial issues ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Retrograde: శని తిరోగమనం.. రాబోయే కొన్ని నెలలు వీరికి ఆర్థిక సంక్షోభం, కోర్టు కేసుల్లో అపజయం

Saturn retrograde: శని తిరోగమనం.. రాబోయే కొన్ని నెలలు వీరికి ఆర్థిక సంక్షోభం, కోర్టు కేసుల్లో అపజయం

Gunti Soundarya HT Telugu
Jun 20, 2024 08:30 AM IST

Saturn retrograde: శని మరికొన్ని రోజుల్లో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. కోర్టు కేసుల్లో అపజయం ఎదురవుతుంది.

శని తిరోగమనం
శని తిరోగమనం

Saturn retrograde: నవగ్రహాలలో శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం, కర్మల అనుసారం ఫలితాలు ఇస్తాడు. మంచి కార్యాలు చేస్తే శుభ ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే దుష్పలితాలు ఇవ్వడం వల్ల శని అంటే అందరికీ భయం ఉంటుంది.

శని ఒక నిర్ధిష్ట రాశి చక్రంలో తన ప్రయాణాన్ని పూర్తి చేసేందుకు రెండున్నర సంవత్సరాలు పాటుడుతుంది. అలా మొత్తం పన్నెండు రాశులను పూర్తి చేసేందుకు ముప్పై సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శని తన మూల త్రికోణ రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో శని తన కదలిక మార్చుకుని తిరోగమన దశలో సంచరించబోతున్నాడు.

జూన్ 29 నుంచి శని తిరోగమన దశలో సంచరించడం వల్ల మరింత శక్తివంతంగా ప్రభావవంతంగా మారుతుంది. దీని ప్రభావం అన్నీ రాశులపై పడుతుంది. నవంబర్ 15 తర్వాత శని మళ్ళీ సాధారణ స్థితిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శని తిరోగమనం వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అవి ఏవో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి పది, పదకొండు ఇంటిని శని పాలిస్తాడు. పదకొండో ఇంట్లో తిరోగమనం జరుగుతుంది. ఫలితంగా ఈ రాశి వారి వృత్తి, లాభాలను ప్రభావితం చేస్తుంది. ఆశించిన ఫలితాలు సాధించేందుకు మీరు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఈ సమయంలో వచ్చే కష్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాపారాలు నిర్వహించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. శని తిరోగమనం మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.

వృషభ రాశి

వృషభ రాశి తొమ్మిది, పదో ఇంటికి అధిపతి. పదో ఇంట్లో తిరోగమనం జరుగుతుంది.దీని ప్రభావం కెరీర్, లాభాలను ప్రభావితం చేస్తుంది. కెరీర్ కు సంబంధించినంత వరకు ఆశించిన ఫలితాలు ఉండవు. చిన్న చిన్న లాభాలను పొందేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. దాని వల్ల తరచూ నిరాశకు గురవుతారు. ఏదైనా పని చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు, ప్రతిభ ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల మనసు గెలుచుకోలేరు. వ్యాపారాలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త వ్యాపారాలు ఈ కాలంలో నిలదొక్కుకోవడం కష్టంగా ఉంటుంది.

మిథున రాశి

శని మిథున రాశి ఎనిమిది, తొమ్మిదో ఇంటికి అధిపతి అవుతాడు. ఈ సమయం మీకు అదృష్టం కలిసి రాకపోవచ్చు. పని పూర్తి చేయడంలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగులకు బదిలీలు జరుగుతాయి. ఆధ్యాత్మికత వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి స్తబ్ధుగా ఉంటుంది.

సింహ రాశి

సింహ రాశి ఆరు, ఏడో ఇంటికి అధిపతి. ఏడో ఇంట్లో తిరోగమనం చేస్తాడు. ఈ కాలంలో మీరు మీ పోటీదారుల నుండి అధిక పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులకు ఇది మంచి సమయం కాదు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పనిలోను సమస్యలు ఎక్కువగా ఉంటాయి. శని తిరోగమనం వైవాహిక జీవితంలో వివాదాలను కలిగిస్తుంది.

కన్యా రాశి

కన్యా రాశి ఆరో ఇంట్లో తిరోగమనం చెందుతాడు. న్యాయవాదులకు ఇది ఉత్తమ సమయం కాకపోవచ్చు. కోర్టు కేసుల్లో ప్రతికూల తీర్పులు వచ్చే అవకాశం ఉంది. శత్రువులు చాలా యాక్టివ్ గా ఉంటారు. మానసికంగా చికాకులు ఉంటాయి. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. రాబోయే కొన్ని నెలలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టడం అనువైన కాలం కాదు.

WhatsApp channel