Saturn retrograde 2023: శని వక్ర గమనం.. ఈ 4 రాశుల జాతకులు జాగ్రత్తగా ఉండాలి
Saturn retrograde 2023: జూన్ నెలలో శని తిరోగమనంలో పయనించనున్నాడు. దీనినే శని వక్రగమనం అని కూడా పిలుస్తారు. ఈ కారణంగా 4 రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వైదిక జ్యోతిష శాస్త్రం చెబుతోంది.
Saturn retrograde 2023: శని జూన్ 17, 2023న రాత్రి 10.48 గంటలకు కుంభ రాశిలో తిరోగమనంలో పయనిస్తాడు. శని తిరోగమనం కారణంగా 4 రాశులపై ప్రభావం పడుతుంది. శని వక్ర గమనం ఏయే రాశులపై ప్రభావం చూపుతుందో ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశిపై శని తిరోగమన ప్రభావం
మేష రాశి జాతకులు శని వక్రగమన సమయంలో సాధారణ కాలం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. పని ఒత్తిడి పెరగడం వల్ల శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి వారిపై శని వక్ర గతి ప్రభావం
కుంభ రాశిలో శని తిరోగమనంలో ఉండి మీ జన్మ జాతకంలో ఎనిమిదో స్థానంలో ఉంటాడు. కర్కాటక రాశి జాతకులు ఈ కాలంలో ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మీరు మరింత కష్టపడాల్సి వస్తుంది. మీ కృషి ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు. దీనితో పాటు వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైదిక జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది.
తులా రాశి వారిపై శని తిరోగమన ప్రభావం
కుంభ రాశిలో శని తిరోగమనం కారణంగా తులా రాశి జాతకులు వృత్తి జీవితంలో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో ఉద్యోగ మార్పు ఆలోచనలకు దూరంగా ఉండాలి. అలాగే తల్లి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి వారిపై శని వక్రగతి ప్రభావం
శని స్వరాశి కుంభ రాశిలో వక్రగమనం మానసిక ఒత్తిడిని సూచిస్తోంది. కుంభ రాశి వారు ఏ రంగంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కుంభ రాశి జాతకులు వైవాహిక జీవితంలో ఒత్తిడి ఎదుర్కొంటారు.