Saturn rahu conjunction: 50 ఏళ్ల తర్వాత శని రాహు శుభయోగం.. ఈ మూడు రాశులకు అదృష్టం పడుతుంది-saturn rahu conjunction after 50 years create auspicious yogam three zodiac signs get lucky ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Rahu Conjunction: 50 ఏళ్ల తర్వాత శని రాహు శుభయోగం.. ఈ మూడు రాశులకు అదృష్టం పడుతుంది

Saturn rahu conjunction: 50 ఏళ్ల తర్వాత శని రాహు శుభయోగం.. ఈ మూడు రాశులకు అదృష్టం పడుతుంది

Gunti Soundarya HT Telugu
Jul 26, 2024 10:34 AM IST

Saturn rahu conjunction: రాహువు ప్రస్తుతం శనికి చెందిన నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఫలితంగా సుమారు 50 సంవత్సరాల తర్వాత శుభయోగం ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది.

శని రాహువు శుభయోగం
శని రాహువు శుభయోగం

Saturn rahu conjunction: జ్యోతిష్య శాస్త్రంలో రాహువును నీడ లేదా దుష్ట గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహానికి సొంత రాశి అంటూ ఏదీ ఉండదు. ఆరుద్ర, స్వాతి, శతభిషా నక్షత్రాలకు రాహువు అధిపతి. వృషభం లేదా మిథున రాశిలో అత్యధికంగా, వృశ్చికం లేదా ధనుస్సు రాశులలో అత్యల్పంగా ఉంటాడని నమ్ముతారు.

రాహువు జాతకంలో శుభప్రదమైన స్థానంలో ఉంటే సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి. భారీ ఆర్థిక లాభాలు ఉంటాయి. ప్రస్తుతం రాహువు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఎల్లప్పుడూ తిరోగమన దశలో సంచరించే రాహువు ఒక రాశిలో 18 నెలల పాటు ఉంటాడు. 2025 సంవత్సరంలో మే 18 నుంచి రాహువు మీన రాశిని వీడి కుంభ రాశి ప్రవేశం చేస్తాడు.

రాహువు రాశి మార్పుతో పాటు నక్షత్రం మార్పు కూడా చేస్తాడు. జూలై 8 నుంచి రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఉత్తర భాద్రపద నక్షత్రం అన్ని నక్షత్రాలలో 26వ స్థానంలో ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి శని. ఆధ్యాత్మికం, క్రమశిక్షణ, సహనం వంటి లక్షణాలు శని శుభ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటాయి. అదే శని బలహీనంగా ఉంటే మాత్రం సోమరితనం, స్వార్థం, ప్రవర్తన కోపంగా ఉంటుంది. శనికి చెందిన నక్షత్రంలో రాహువు సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది. సుమారు 50 సంవత్సరాల తర్వాత రాహువు, శని కలసి అద్భుతమైన యోగాన్ని సృష్టించారు. దీని ప్రభావంతో అదృష్టాన్ని పొందబోతున్న రాశులు ఏమో తెలుసుకుందాం.

మకర రాశి

రాహువు ప్రస్తుతం మకర రాశి మూడో ఇంట్లో సంచరిస్తున్నాడు. అదే సమయంలో శని డబ్బు, వాక్కు ఇంట్లో ఉన్నాడు. శని రాహు కలయిక మీకు మంచి చేస్తుంది. ధైర్యసాహసాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు తమ పని పట్ల సంతోషం, సంతృప్తిని పొందుతారు. వ్యాపారస్తులకు ఉత్పాదకత, లాభదాయకత పెరుగుతుంది. ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.

వృషభ రాశి

రాహువు, శని కర్మ గృహం ద్వారా సంచారం చేస్తున్నారు. అందువల్ల వృషభ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. రాబడిలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి సమయం. వ్యాపారస్తులకు గణనీయమైన ఆదాయాలు, వృద్ధి ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది ఉత్తమమైన సమయం. వ్యాపారాలు విస్తరించుకునేందుకు గొప్ప అవకాశాలు పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

మిథున రాశి

రాహువు మిథున రాశిలో పదో ఇంట్లో, శని గ్రహం తొమ్మిదో ఇంట్లో సంచరిస్తున్నారు. శని, రాహువు మధ్య అరుదైన కలయిక ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. చాలా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగం మారెందుకు ఇదే సరైన సమయం. కొత్త ఉద్యోగం మీకు మంచి అవకాశాలు అందిస్తుంది. పెట్టిన పెట్టబడుల నుంచి భారీ లాభాలను అందుకుంటారు. పిల్లల నుండి అద్భుతమైన వార్తలను అందుకుంటారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner