Saturn transit 2025: 2025 మార్చి నుంచి ఈ రాశుల వారిపై శని చెడు దృష్టి.. జాగ్రత్తగా ఉండాల్సిందే-saturn negative impact on these five zodiac signs from march 2025 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Transit 2025: 2025 మార్చి నుంచి ఈ రాశుల వారిపై శని చెడు దృష్టి.. జాగ్రత్తగా ఉండాల్సిందే

Saturn transit 2025: 2025 మార్చి నుంచి ఈ రాశుల వారిపై శని చెడు దృష్టి.. జాగ్రత్తగా ఉండాల్సిందే

Gunti Soundarya HT Telugu
Jun 28, 2024 03:07 PM IST

Saturn transit 2025: ప్రస్తుతం శని కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. 2025 లో శని రాశు మార్పు కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఏ రాశుల వారికి శని చెడు కన్ను ఉంటుందో తెలుసుకుందాం.

2025 మార్చి నుంచి వీరిపై శని చెడు దృష్టి
2025 మార్చి నుంచి వీరిపై శని చెడు దృష్టి

Saturn transit 2025: నిర్ణయాధికారి, కర్మల అనుసారం ఫలితాలను ఇచ్చే శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. తొమ్మిది గ్రహాలలో శనికి న్యాయాధిపతి హోదా ఉంది.

yearly horoscope entry point

జ్యోతిషశాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. అందుకే శని సంచారం అన్నీ రాశుల మీద చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శని ప్రస్తుతం దాని అసలు త్రిభుజం రాశిచక్రం కుంభ రాశిలో ఉంది. 2023 లో కుంభ రాశిలో ప్రవేశించిన శని తన తదుపరి రాశి మార్పు 2025 లో జరుగుతుంది. అప్పటి వరకు కుంభ రాశిలో ఉంటూనే తన కదలికలు మార్చుకుంటూ రాశి చక్ర గుర్తుల మీద శుభ, అశుభ ప్రభావాలు చూపిస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం శని 2025 నుండి రాబోయే రెండున్నర సంవత్సరాలలో కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాడు. 2025లో ఏ రాశుల వారు శనిదేవుని అసంతృప్తిని ఎదుర్కోవలసి వస్తుందో తెలుసుకోండి

శని రాశి మార్పు ఎప్పుడు?

2025లో ఏ రాశిలో శని రాశి మార్పు ఉంటుంది. మార్చి 29, 2025న శని కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. శని మీన రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తుంది. అంటే జూన్ 3, 2027 వరకు ఉంటాడు. మీన రాశికి శని రాక కారణంగా ఈ రాశి వారికి కార్యాలయంలో కొన్ని పెద్ద బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. నాయకత్వ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. శని చల్లని చూపు ఉంటే పేదవాడు కూడా రాజు అవుతాడని చెప్తారు. కానీ చెడు చెడు కన్ను పడిందంటే మాత్రం ఒక వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

శని దయ్యా ఎప్పుడు ప్రారంభమవుతుంది?

శని రాశిని మార్చినప్పుడు ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావం కూడా మారుతుంది. శని రాశి మార్పు కారణంగా దయ్యా ప్రభావం కూడా మారుతుంది. ప్రస్తుతం అర్థాష్టమ శని( శని దయ్యా) ప్రభావం కర్కాటక, వృశ్చిక రాశుల మీద ఉంది. మార్చి 29, 2025 నుంచి కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి శని దయ్యా నుండి ఉపశమనం లభిస్తుంది. దీని తరువాత సింహం, ధనుస్సు రాశుల వారికి అర్థాష్టమ శని ప్రారంభమవుతుంది. దీని ప్రభావం రెండున్నరేళ్ల పాటు ఉంటుంది.

ఈ రాశులకు సడే సతి సమస్యలు

ఏలినాటి శని(సడే సతి) మూడు దశలుగా ఉంటుంది. శని సంచరించే ముందు, వెనుక రాశుల మీద ఏలినాటి శని ప్రభావం కనిపిస్తుంది. శని మీనంలోకి రావడంతో మేష రాశి వారికి శని సడే సతి ప్రారంభమవుతుంది. 2025లో శని సంచారంతో మేష రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది. మీన రాశిలో శని గ్రహం సడే సతి రెండవ దశ ప్రారంభమవుతుంది. కుంభ రాశి వారికి శని సడే సతి మూడవ దశ ప్రారంభమవుతుంది.

2025 వీరిపై శని చెడు కన్ను

2025లో సడే సతి, దయ్యాతో బాధపడే రాశుల వారిపై శని దుష్ప్రభావాల ఫలితం ఎక్కువగా ఉంటుంది. 2025 నుండి ధనుస్సు, సింహం, మేషం, కుంభం, మీన రాశుల వారిపై చెడు కన్ను ఉంటుంది. దీని వల్ల ఆయా రాశుల వారి జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడేందుకు శని అనుగ్రహం పొందాలి.

.గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner