వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళుతూ ఉంటాయి. అక్టోబర్ 6న శని,చంద్రుల సంయోగం చోటు చేసుకోనుంది. ఈ యోగం చాలా ప్రమాదకరమైనది. ఇది కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను తీసుకురానుంది. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో శుభ యోగాలు, అశుభ యోగాలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయి.
ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. అక్టోబర్ 6న చంద్రుడు కూడా మీనరాశిలోకి అడుగుపెడతాడు. ఈ రెండిటి సంయోగం కారణంగా కొన్ని రాశుల వారు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యపరంగా సమస్యలు రావచ్చు. డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.
ఆర్థికపరంగా కూడా చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మరి ఏ ఏ రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఎవరికి ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈ సంయోగం కారణంగా సమస్యలు రావచ్చు. ఈ రాశి వారికి ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంది. ఈ రెండిటి సంయోగం వలన ఉద్యోగులకు కూడా చిన్నపాటి సమస్యలు రావచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. పెద్ద ఇన్వెస్ట్మెంట్లకు దూరంగా ఉండండి.
సింహ రాశి వారికి ఈ యోగం అశుభ ఫలితాలను తీసుకు వస్తుంది. చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సమస్యలు రావచ్చు. ఆర్థికపరంగా కూడా చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు కాపాడే విధంగా చూసుకోండి. ఆర్థికపరంగా రిస్క్ తీసుకోవద్దు. వ్యాపారంలో కూడా లాభాలు తగ్గే అవకాశం ఉంది.
మీన రాశి వారికి కూడా చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. ఈ రెండు గ్రహాల కారణంగా మీన రాశి వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇతరులకు అప్పు ఇవ్వడం వంటివి మానుకోండి. ఈ సమయంలో ఆర్థిక నష్టాలు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది.
అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. మీ భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. టెన్షన్లు పెట్టుకోవద్దు. ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి.