Saturn mars conjunction: శని, కుజుడు కలిసి ఈ మూడు రాశుల వారికి శుభవార్తలు అందిస్తారు
Saturn mars conjunction: శని, మండే గ్రహంగా పరిగణించే అంగారకుడి కలయిక వల్ల మూడు రాశుల వారికి మేలు జరుగుతుంది. అదృష్టం కలిసి రావడం వల్ల లావాదేవీలు సజావుగా సాగుతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
Saturn mars conjunction: జ్యోతిష్యంలో శని, అంగారక గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. కుజుడు జూన్ 1న మేష రాశిలోకి ప్రవేశించి జూలై 12, 2024 వరకు అక్కడే ఉంటాడు. శౌర్యం, ధైర్యం ఇచ్చే గ్రహంగా అంగారకుడిని భావిస్తారు. ఇక శని కర్మల అనుసారం ఫలితాలను ఇస్తాడు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఇవి రెండు శత్రు గ్రహాలుగా పరిగణిస్తారు.
కుజుడు మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల శని దేవుని మూడవ చూపు అంగారకుడిపై పడటం వల్ల కొన్ని రాశుల వారు దీని వల్ల ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. అదేవిధంగా శనిగ్రహం అశుభ ప్రభావం వల్ల మనిషి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే శని శుభప్రదమైనప్పుడు ఒక పేదవాడు కూడా రాజు అవుతాడు. ఏయే రాశులకు శని, కుజుడు కలిసి శుభ ఫలితాలను ఇస్తున్నాయో తెలుసుకుందాం.
మేష రాశి
శని కుజుడి కలయిక మేష రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో కొత్త దిశలో ఏకాగ్రత వహించండి. వ్యాపార పరంగా ఈ వారం బాగుంది కానీ లావాదేవీలు చేసే విషయంలో జాగ్రత్త అవసరం. మీరు పాత స్నేహితుడిని కలుసుకుంటారు.
మిథున రాశి
అంగారకుడు, శని కలిసి మిథున రాశి వారికి శుభ ప్రయోజనాలు ఇస్తున్నారు. కార్యాలయంలో మంచి వాతావరణం నెలకొంటుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. పాత వ్యాధులు దూరమవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. . ఆర్థిక ఇబ్బందుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
కన్యా రాశి
జూన్ నెల కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. మీరు మీ పెండింగ్ డబ్బు తిరిగి పొందవచ్చు. ఇది కాకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. కష్టపడి పని చేయండి. మీరు ప్రయోజనాలను పొందుతారు. ముందుగా లావాదేవీ విషయాలను పరిష్కరించండి. మీరు కార్యాలయంలో ఊహించిన దాని కంటే ఎక్కువ విజయాన్ని పొందుతారు. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారానికి అనుకూలమైన సమయం. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. గౌరవం పెరుగుతుంది. మీ పని పట్ల ఆఫీసులో ఉన్నతాధికారులు సంతోషంగా ఉంటారు. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి. మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు.
శని కుజుడి కలయిక కర్కాటకం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వకపోవచ్చు. వ్యాపారంలో నష్టాలు, డబ్బు సంపాదించేందుకు చేసే ప్రయత్నాలు విఫలం కావచ్చు. ఒత్తిడి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కెరీర్ పరంగాను ఎదురుదెబ్బలు తగులుతాయి. ఆర్థికంగా కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండటమే మంచిది. కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు లభించదు. ధైర్యం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ప్రేమ జీవితంలో ఒత్తిడి నెలకొంటుంది.