జ్యోతిష్య శాస్త్రంలో శనిని న్యాయ దేవుడు అని పిలుస్తారు. శని మనం చేసే పనులు ఆధారంగా ఫలితాలు ఇస్తాడు. శని దేవుడు కుంభ రాశి, మకర రాశులకు అధిపతి. శని సుమారు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తాడు. 12 రాశి చక్రాలను పూర్తి చేయడానికి 30 ఏళ్లు పడుతుంది. మధ్యమధ్యలో ప్రత్యక్షంగా ఉండడం, తిరోగమనం చెందడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
జూలై 13న మీన రాశిలో శని ప్రత్యక్ష సంచారంలో ఉంటాడు. నవంబర్ 28 వరకు నేరుగానే సంచరిస్తాడు. ఈ సంచారం కారణంగా ఐదు నెలల పాటు అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. కానీ మూడు రాశులకు అదృష్టాన్ని, శ్రేయస్సుని కురిపిస్తాడు. మరి అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి వారికి శని ప్రత్యేక సంచారం అదృష్టాన్ని అందిస్తుంది. ఈ ఐదు నెలలు ఎన్నో విజయాలను అందుకుంటారు. పూర్తికాని పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది. సోదరుల నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీకు ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృషభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం అనేక లాభాలని అందిస్తుంది. ఈ సమయంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ కూడా రావచ్చు. కుటుంబంలో ప్రేమానురాగాలు ఎక్కువవుతాయి. సంతోషంగా, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
కర్కాటక రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం లాభదాయకంగా ఉంటుంది. వివాహం కాని వారికి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారు మరి ఇంట్లో శుభకార్యాలు కూడా జరగవచ్చు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. బిజినెస్ లో కూడా లాభాలు రావచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.