Lucky zodiac signs: నవంబర్ నుంచి ఈ రాశుల వారికి ప్రతిరోజు దీపావళే- అప్పులు తీరి ఇక ఆదాయమే-saturn direct position from november 15th these zodiac signs get relief from debits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lucky Zodiac Signs: నవంబర్ నుంచి ఈ రాశుల వారికి ప్రతిరోజు దీపావళే- అప్పులు తీరి ఇక ఆదాయమే

Lucky zodiac signs: నవంబర్ నుంచి ఈ రాశుల వారికి ప్రతిరోజు దీపావళే- అప్పులు తీరి ఇక ఆదాయమే

Gunti Soundarya HT Telugu
Oct 05, 2024 01:38 PM IST

Lucky zodiac signs: దీపావళి సమయంలో శని తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి ప్రవేశిస్తాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ప్రతిరోజు దీపావళి మాదిరిగానే ఉంటుంది. అప్పులు తీరి ఆదాయమే లభిస్తుంది. వాహనం, ఆస్తి కొనుగోలు చేస్తారు.

నవంబర్ నుంచి ఈ రాశుల వారికి రోజూ పండగే
నవంబర్ నుంచి ఈ రాశుల వారికి రోజూ పండగే

న్యాయదేవుడు శని ప్రస్తుతం తిరోగమన దశలో కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో ప్రత్యక్ష స్థితిలోకి రాబోతుంది. శని ప్రత్యక్ష సంచారం అన్ని రాశుల మీద ఉంటుంది.

15 నవంబర్ 2024న, శని గ్రహం సాయంత్రం 05:09 గంటలకు కుంభ రాశిలో ప్రత్యక్ష మార్గంలోకి వస్తుంది. శని దేవుడు జూన్ 2024 నెలలో తిరోగమనం చెందాడు. ఇప్పుడు దీపావళి తర్వాత ప్రత్యక్ష స్థితిలోకి రాబోతుంది. శని ప్రత్యక్ష స్థానంలో ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉన్న మూడు రాశులు ఉన్నాయి. అవి ఏ రాశులో చూద్దాం.

మిథున రాశి

శని ప్రత్యక్షంగా మారడం వల్ల మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అదృష్టం అండగా నిలుస్తుంది. జీవితంలోని వివిధ రంగాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు, పనుల కోసం ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగం చేసే చోట కొత్త బాధ్యతలు అందిపుచ్చుకుంటారు. రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. కుటుంబంలో శాంతి, సంతోష వాతావరణం ఉంటుంది. వాహనం లేదా అస్తి మొదలైనవి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. కెరీర్ లో పురోగతి, లాభాలు పొందుతారు.

వృశ్చిక రాశి

ఈ రాశికి కుజుడు పాలక గ్రహం. శని ప్రత్యక్ష సంచారం వీరికి లాభదాయకంగా ఉంటుంది. సౌకర్యాలు మెరుగుపడతాయి. ఆర్థిక విజయం, శ్రేయస్సు పొందుతారు. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో అనుబంధం ధృడంగా ఉంటుంది. మీ ప్రణాళికలన్నీ సఫలం అవుతాయి. సమస్యలన్నీ అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన సమయం. కార్యాలయంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారస్తులు భారీ లాభాలు పొందుతారు. ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి.

మకర రాశి

మకర రాశిని పాలించే గ్రహం శని. అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయం ఫలవంతంగా ఉంటుంది. పనుల్లో విజయం చేకూరుతుంది. సమాజంలో మీ గౌరవ స్థాయిలు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించి కష్టాలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారస్థులకు నిలిచిపోయిన డబ్బు తిరిగి లభిస్తుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా మెరుగుపడతాయి. విజయం, పురోగతికి ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.

సింహ రాశి

శని ప్రత్యక్ష సంచారం సింహ రాశి వారికి సంపదను పెంచి ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. తల్లి నుంచి డబ్బు పొందుతారు. కళ, సంగీతం పట్ల ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగస్తులు కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఆదాయ స్థాయిలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది.

కన్యా రాశి

శని ప్రత్యక్షం మారడం వల్ల కన్యా రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళతారు. ఆస్తి ద్వారా ఆదాయం, సంపద పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మార్పులు ఉంటాయి. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆర్థిక రంగంలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులు ఈ కాలంలో సానుకూల ఫలితాలు పొందుతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner