గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించేటప్పుడు మరో గ్రహంతో సంయోగం చెందినప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. వీటిలో శుభయోగాలు, అశుభయోగాలు రెండు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని నెమ్మదిగా కదిలే విగ్రహం. శని ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది.
ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. జూన్ 22 ఉదయం 11:43కు శుక్రుడు, శని 45 డిగ్రీల కోణంలో ఉంటారు. దీంతో అర్ధకేంద్ర యోగం ఏర్పడుతుంది. అర్థ కేంద్ర యోగం శుభయోగం. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది.
శుక్రుడు అందం, విలాసాలకు కారకుడు. అర్థ కేంద్ర యోగం 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రమే శుభ ఫలితాలను ఇస్తుంది. శని, శుక్రుడి కలయికతో ఏర్పడిన ఈ అర్థ కేంద్ర యోగం కొన్ని రాశుల వారికి సంపదని అందిస్తుంది. కెరియర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. రిలేషన్‌షిప్‌లో కూడా సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.
మేష రాశి వారికి శని, శుక్రుడి అర్థకేంద్ర యోగం బాగా కలిసి వస్తుంది. మేష రాశి 12వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ సమయంలో సక్సెస్‌ను అందుకుంటారు. స్నేహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. కెరియర్‌లో కూడా అనేక లాభాలు ఉంటాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. జీవితంలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది.
వృషభ రాశి వారికి అర్థ కేంద్ర యోగం అనేక విధాలుగా లాభాలని అందిస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి ప్రైవేటు జీవితం మధురంగా మారుతుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తయిపోతాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఉంటుంది. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు ఉండవు.
మకర రాశి వారికి అర్థ కేంద్ర యోగం అనేక విధాలక లాభాలని అందిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితం మధురంగా మారుతుంది. వివాహం కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి సమయం కలిసి వస్తుంది.
కష్టపడితే దానికి తగిన ఫలితాన్ని మీరు అందుకోవచ్చు. పై అధికారులు మీపై నమ్మకాన్ని పెంచుకుంటారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.