Unlucky zodiac signs: శని, బుధ గ్రహాల కదలిక.. జూన్ 29 నుంచి ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో అలజడి
Unlucky zodiac signs: ఒకే రోజు శని, బుధ గ్రహాల కదలికలో మార్పు జరగబోతుంది. ఫలితంగా నాలుగు రాశుల వారి జీవితంలో జూన్ 29 నుంచి అలజడి నెలకొనబోతుంది. కొన్ని కష్టాలు ఇబ్బంది పెట్టనున్నాయి.
Unlucky zodiac signs: జ్యోతిష్య శాస్త్రంలో ఏదైనా గ్రహం స్థానం, కదలిక రెండూ చాలా ముఖ్యమైనది. ప్రతి గ్రహం సంచారం, కదలికలో మార్పు మానవ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జూన్ నెల ముగియడానికి ఒక్కరోజు ముందు శనిగ్రహం తన గమనాన్ని మార్చుకోనుంది.
ఇక అదే రోజున గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా రాశిని మార్చుకుంటాడు. అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు జూన్ 27న ఉదయించాడు. జూన్ 29 మధ్యాహ్నం బుధుడు మిథున రాశిని వీడి చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కొంత సమయం తరువాత న్యాయదేవుడిగా పరిగణించే శని కుంభ రాశిలో తిరోగమనం ప్రారంభమవుతుంది.
నవంబర్ 15వరకు శని తిరోగమన దశలో ఉంటాడు. ఇక బుధుడు జూన్ నెలలో రెండో సారి తన రాశిని మార్చుకున్నాడు. శని, బుధ గ్రహాల స్థానాలు ఒకే రోజు మారడం వల్ల మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. శని, బుధ గ్రహాల స్థానం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో కష్టాలు పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
మేష రాశి
మేష రాశిని పాలించే గ్రహం కుజుడు. మేష రాశి వారు శని, బుధ గ్రహాల సంచార ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ కాలంలో మీ ఖర్చులు పెరగవచ్చు. డబ్బుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం ముఖ్యం. వృత్తిలో ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి.
కర్కాటక రాశి
శని తిరోగమన ప్రభావం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. ఒత్తిడిని పెంచుతుంది. కర్కాటక రాశి వారు తమ ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఆర్థిక బడ్జెట్‌ను సిద్ధం చేయని వారు కూడా రుణం తీసుకోవలసి ఉంటుంది. మీ కొనసాగుతున్న పనిలో అడ్డంకులు ఉండవచ్చు. మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారులు మీ కష్టాన్ని విస్మరిస్తారు. ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేసుకోవడం మంచిది.
సింహ రాశి
శని, బుధుడు కలిసి సింహ రాశి వారికి సమస్యలు సృష్టించవచ్చు. శని తిరోగమన కదలికలు సింహ రాశి వారికి కష్టకాలన్ని ఇస్తాయి. ఈ కాలంలో మీరు ఊహించని ఖర్చులను ఎదుర్కోవచ్చు, డబ్బు ఆదా చేసుకోండి. అనవసరమైన కొనుగోళ్లను నివారించండి. లేకుంటే మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. తీవ్ర అసంతృప్తికి లోనవుతారు.
తులా రాశి
తులా రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. మీరు కార్యాలయంలో పని భారంగా భావించవచ్చు. ఉద్యోగస్తులు మనసు వివధ రకాలుగా దెబ్బతింటుంది. పురోగతిలో అడ్డంకులు ఉండవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. ఉద్యోగం చేసే ప్రదేశంలో మీ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.